News August 10, 2024
NZB: నరేందర్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టు అయిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్వో నరేందర్ కు ఏసీబీ కోర్టు శనివారం 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం సాయంత్రం నరేందర్ ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు శనివారం ఆయనను నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించగా నరేందర్ ను జైలుకు తరలించారు.
Similar News
News February 6, 2025
KMR: సైబర్ మోసాలపై జర జాగ్రత్త..!
సైబర్ మోసగాళ్లు అమాయకులను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే నకిలీ ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని, కొంత పెట్టుబడి పెడితే ఎక్కువ సంపాదించవచ్చని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. కామారెడ్డి ఇందిరానగర్ ZPHSలో సైబర్ జాగృత దివస్ సందర్భంగా కానిస్టేబుల్ ప్రవీణ్ అవగాహన కల్పించారు.
News February 6, 2025
నిజామాబాద్‌లో చికెన్ ధరలు
నిజామాబాద్‌లో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్‌లెస్ KG రూ.220 నుంచి రూ.240, విత్ స్కిన్ రూ.200 నుంచి రూ.210 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. అయితే, బాన్సువాడలో వైరస్ ప్రభావంతో కామారెడ్డిలో KG రూ. 180కి పడిపోవడం గమనార్హం. ఇంతకీ మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయి.?
News February 6, 2025
NZB: రుణాలు ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి: సెర్ఫ్ డైరెక్టర్
స్వయం సహాయక సంఘ సభ్యులు బ్యాంకు రుణాలు పొంది జీవనోపాధి పొందుతున్న ఆదాయ వివరాలు ఈ రిజిస్టర్లో నమోదు చేయాలని సెర్ఫ్ డైరెక్టర్ ప్రశాంతి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన డీపీఎం, ఎపీఎం, సీసీ, కంప్యూటర్ ఆపరేటర్లు, గ్రామస్థాయిలో పనిచేసే అసిస్టెంట్లకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ అధికారి సాయ గౌడ్, జిల్లాల అధికారులున్నారు.