News August 10, 2024
గృహ నిర్మాణాల్లో పురోగతి ఉండాలి: ప్రకాశం కలెక్టర్

ప్రకాశం జిల్లాలో హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున జరుగుతున్న గృహ నిర్మాణాల్లో పురోగతి ఉండాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు. స్థానిక ప్రకాశం భవనంలో శుక్రవారం హౌసింగ్, ఆర్ డబ్ల్యూఎస్, డీఆర్డీఏ, మెప్మా, డ్వామా, జెడ్పీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం హౌసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారులు గృహ నిర్మాణాలపై శ్రద్ధ వహించాలన్నారు.
Similar News
News September 14, 2025
బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత!

ఎమ్మెల్సీ పోతుల సునీత ఆదివారం BJPలో చేరారు. విశాఖలో జరుగుతున్న సారథ్యం సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికల అనంతరం వైసీపీకి దూరంగా ఉన్న పోతుల సునీత BJPలో చేరడం చర్చనీయాంశంగా మారింది.
News September 14, 2025
కందుకూరు: కరేడులో టెన్షన్..టెన్షన్..

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు (M) కరేడులో ఆదివారం అంతటా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆంక్షల నడుమ బోడె రామచంద్ర యాదవ్ మీటింగ్ జరగాల్సి ఉండటంతో పరిణామాలు ఎలా దారి తీస్తాయో అన్న టెన్షన్ అందరిలో ఏర్పడింది. జూలై 29న జరిగిన హైవే దిగ్బంధం కార్యక్రమంలో కూడా బోడె రామచంద్ర వెంట అనూహ్యంగా వేలాది మంది కరేడు ప్రజలు దూసుకొచ్చిన ఘటన తెలిసిందే. ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.
News September 14, 2025
ప్రకాశం నూతన ఎస్పీ.. తిరుపతిలో ఏం చేశారంటే?

ప్రకాశం జిల్లా నూతన SPగా హర్షవర్ధన్ రాజు నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుపతి SPగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. TTD CVSOగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. తిరుపతి SPగా విధుల సమయంలో రాత్రి వేళ నైట్ విజన్ డ్రోన్లు రంగంలోకి దించి గంజా బ్యాచ్ అంతు చేశారు. తిరుపతి హోమ్ స్టేల కోసం నూతన యాప్ ప్రవేశపెట్టి తన మార్క్ చూపించారు. ఈయన తిరుపతికి ముందు కడప జిల్లాలో ఎస్పీగా పనిచేశారు.