News August 10, 2024

భారతీయుల విడుదలకు చర్యలు: రష్యా ఎంబసీ

image

రష్యా ఆర్మీలో ప‌నిచేస్తున్న భార‌తీయుల విడుద‌ల‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నామని ఢిల్లీలో ర‌ష్యా ఎంబ‌సీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇప్పటికే పలువురు భార‌తీయులు ప్రాణాలు కోల్పోవ‌డంపై భారత ప్రభుత్వానికి, బాధిత కుటుంబాల‌కు సంతాపం ప్ర‌క‌టించింది. ఏప్రిల్ నుంచి భార‌త పౌరులను సైన్యంలో చేర్చుకోవ‌డాన్ని ర‌ష్యా నిలిపివేసిన‌ట్టు వెల్ల‌డించింది.

Similar News

News March 10, 2026

BREAKING: రూ.10వేలు పెరిగిన KG వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,62,380కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 ఎగబాకి రూ.1,48,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.10,000 పెరిగి రూ.3,00,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.

News March 10, 2026

ఇకపై రైతులు ‘గడ్డి మందు’ కొనాలంటే..

image

TG: కలుపు నివారణకు ఉపయోగిస్తున్న పారాక్వాట్ డైక్లోరైడ్ రైతుల ప్రాణాలకు ముప్పుగా మారింది. దీంతో దాని విక్రయాలపై ప్రభుత్వం నియంత్రణ చేపట్టింది. ఇకపై వ్యవసాయ అధికారులు పొలాలను పరిశీలించి గడ్డి మందు అవసరమని భావిస్తేనే కొనుగోలుకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలని ఆదేశించింది. దాని ఆధారంగానే అన్నదాతలకు మందులను విక్రయించాలని, ఇందుకు ప్రత్యేక రిజిస్టర్ మెయింటెన్ చేయాలని షాపులకు సూచించింది.
#ShareIt

News March 10, 2026

‘గడ్డి మందు’ ఎంత ప్రమాదకరమంటే?

image

కలుపు నివారణకు పారాక్వాట్ డైక్లోరైడ్ పిచికారీ చేసేటప్పుడు పొరపాటున శరీరంలోకి వెళ్తే లంగ్స్, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. తక్కువ సమయంలోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణం సంభవిస్తుంది. దీనికి యాంటీ డోట్ లేదు. ఒక్క చుక్కయినా ప్రాణాంతకమే. అందుకే దీని అమ్మకాలపై TG ప్రభుత్వం నియంత్రణ చేపట్టింది. గడ్డి మందును పిచికారీ చేసేటప్పుడు రైతులు ముఖానికి మాస్కులు వేసుకోవాలి.
#ShareIt