News August 10, 2024

కుక్క కరిస్తే ఏం చేయాలి?

image

✒ ధారగా పడుతున్న నీటితో 15min గాయాన్ని కడగాలి. ఇలా చేస్తే కుక్క లాలాజలం శరీరంలోకి ప్రవేశించదు.
✒ గాయమైన చోటును యాంటిసెప్టిక్ లోషన్‌తో శుభ్రం చేయాలి. ఆ తర్వాత డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి టీటీ ఇంజక్షన్ వేయించాలి.
✒ కరిచిన చోటును మూసి ఉంచొద్దు. నీరు, రక్తం కారుతున్నా అలాగే వదిలేయాలి.
✒ వైద్యుల సూచన మేరకు యాంటీ రేబిస్ టీకాను అవసరమైన (3లేదా5) మోతాదుల్లో తీసుకోవాలి.

Similar News

News January 9, 2026

తూ.గో: హోటళ్లు, రిసార్టులు హౌస్‌ఫుల్

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు నుంచి తరలివస్తున్న అతిథులతో సందడి నెలకొంది. ఈ నెల 13 నుంచి 18 వరకు హోటళ్లు, రిసార్టులు ఇప్పటికే నిండిపోయాయి. కోడిపందాలు, పడవ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలకు ప్రముఖులు హాజరవుతున్నారు. అతిథుల మర్యాదల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

News January 9, 2026

గర్భాశయ రక్తస్రావం గురించి తెలుసా?

image

మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, వయస్సుతో పాటు అనేక గర్భాశయ సంబంధిత సమస్యలు స్త్రీలను ఇబ్బంది పెడుతున్నాయి. వాటిల్లో ఒకటే గర్భాశయ రక్తస్రావం. పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం, పీరియడ్స్ మధ్య స్పాటింగ్, సంభోగం తర్వాత రక్తస్రావం ఉన్నా గర్భాశయ రక్తస్రావం అంటారు. ఇది ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, PCOS, థైరాయిడ్ వల్ల వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

News January 9, 2026

శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా?

image

లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజున చేసే కొన్ని పనులు దారిద్ర్యానికి దారితీస్తాయని పండితులు చెబుతున్నారు. ‘దేవుడి పటాలు శుభ్రం చేయకూడదు. పాత విగ్రహాలు బయట పడేయకూడదు. అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయవద్దు. జుట్టు, గోళ్లు కత్తిరించకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచితే లక్ష్మీ కటాక్షంతో సిరి సంపదలు కలుగుతాయి’ అని సూచిస్తున్నారు. కుబేర యోగం కలగాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.