News August 10, 2024

ఎస్పీ సతీశ్ కుమార్‌ను కలిసిన జేసీ భార్గవ్

image

ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమష్టిగా పని చేయాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. ఈ మేరకు ఇటీవల జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన భార్గవ్ తేజ ఎస్పీని శనివారం కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శాంతి భద్రతలపై సమష్టిగా పనిచేయాలని ఎస్పీ సూచించారు.

Similar News

News February 18, 2026

పోక్సో కేసులో అసెంబ్లీ ASO మునిరాజా అరెస్ట్

image

AP అసెంబ్లీ ఉద్యోగి ASO మునిరాజా తండ్రిలా దరిచేరి బాలికపై అత్యాచారయత్నం చేశాడు. లైంగిక దాడి, కుల దూషణ కేసులో అరెస్ట్ చేసినట్లు నున్న పోలీసులు వెల్లడించారు. విజయవాడకు చెందిన భర్త లేని ఓ తల్లి, ఆమె కూతురిని 2 ఏళ్లుగా ఆర్థికంగా, మానసికంగా మునిరాజా వేధించడం, బాలిక దుస్తుల మార్చుకునే దృశ్యాలు చిత్రీకరించినట్లు విచారణలో తేలింది. ఈయన వెలగపూడిలోని AP అసెంబ్లీలో పనిచేస్తూ తాడేపల్లిలో నివాసం ఉంటున్నాడు.

News February 18, 2026

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

image

గుంటూరు జిల్లాలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయి. అనంతరం విద్యార్థులకు భోజనం పెడతారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తాయి. టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తారు. జూన్ 12న బడులు పునఃప్రారంభం అవుతాయి.

News February 18, 2026

పీఎఫ్ జమల్లో ఆలస్యం.. ఉపాధ్యాయుల ఆందోళన

image

గుంటూరు జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుల పీఎఫ్ బకాయిల జమ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. 2022లో జీతాల నుంచి కత్తిరించిన మొత్తాలు ఇంకా ఖాతాలకు చేరకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా నివేదికలలో స్పష్టత లేకపోవడం వల్ల జాప్యం జరుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బదిలీల కారణంగా వివరాలు సేకరించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే డీఏ బకాయిలు కూడా పూర్తిగా జమ కాలేదని వారు అంటున్నారు