News August 10, 2024
స్ట్రాటజీ ముందు చెప్పరు: చంద్రబాబు

ప్రత్యేక పరిస్థితుల్లో TTDP అధ్యక్షుడిని నియమించలేదని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు, AP CM చంద్రబాబు తెలిపారు. HYD NTR భవన్‌లో మాట్లాడిన ఆయన ‘2 ఎలక్షన్స్‌లో మేం పోటీ చేయలేదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది. అప్పటి పరిస్థితుల వల్ల ఏపీపైనే దృష్టి పెట్టాలనుకున్నాం. పెట్టాం. ఇక్కడ కూడా సరైన సమయంలో సరైన స్ట్రాటజీ ఉంటుంది. ఎక్కడైనా స్ట్రాటజీ ముందు చెప్పరు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News March 28, 2026
IPL 2026: కోహ్లీ ముందున్న 5 అరుదైన రికార్డులు

IPLలో కోహ్లీ పలు రికార్డులపై కన్నేశారు. 339 రన్స్ సాధిస్తే 9,000 IPL పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తారు. అలాగే ఒకే జట్టు (RCB) తరపున 10,000 T20 రన్స్, 300 సిక్సర్లు బాదిన ఫస్ట్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. భారత్‌లో 10,000 T20 రన్స్ మైల్‌స్టోన్‌కు కేవలం 296 పరుగుల దూరంలో ఉన్నారు. ఒకే వేదికపై (చిన్నస్వామి స్టేడియం) హయ్యెస్ట్ రన్స్ రికార్డును మరింత మెరుగుపరుచుకోనున్నారు.
News March 28, 2026
ట్రంప్-మోదీ ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్

యుద్ధం నేపథ్యంలో ఇటీవల ట్రంప్, మోదీ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ కాల్‌లో మస్క్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగే దౌత్యచర్చల్లో ఏ ప్రభుత్వ పదవిలో లేని ఒక ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం చాలా రేర్. ముఖ్యంగా గ్లోబల్ ఎనర్జీకి కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ కంట్రోల్ గురించి చర్చిస్తున్న సమయంలో మస్క్ ఉండటం చర్చనీయాంశమైంది.
News March 28, 2026
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి

ఇజ్రాయెల్ తాజా ఎయిర్ స్ట్రైక్స్‌లో ఇరాన్‌లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్, అర్దకాన్ యురేనియం ప్లాంట్‌లను టార్గెట్ చేసింది. అణ్వాయుధాల తయారీకి అవసరమైన కీలక ఇన్‌ఫ్రాను ధ్వంసం చేయడమే లక్ష్యమని IDF వెల్లడించింది. ఈ అటాక్స్‌లో ఎటువంటి ప్రాణనష్టం, రేడియేషన్ ముప్పు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.


