News August 10, 2024
తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పోటీ?
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర నేతలు, కార్యకర్తలతో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ NTR భవన్‌లో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతంపై చర్చించారు. వారి నుంచి సూచనలు, వినతులు స్వీకరించారు. గ్రామాల్లో క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నేతలకు చంద్రబాబు సూచించారు.
Similar News
News January 18, 2025
ఢిల్లీ ఎన్నికలు: అన్ని పార్టీలదీ అదే దారి!
తాము ఉచితాలకు వ్యతిరేకమని చెప్పుకునే బీజేపీ సైతం ఢిల్లీ ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించింది. ప్రతి నెల మహిళలకు రూ.2,500, గర్భిణులకు రూ.21,000 ఇస్తామని జేపీ నడ్డా ప్రకటించారు. మరోవైపు మహిళలకు కాంగ్రెస్ రూ.2,500, ఆప్ రూ.2,100 ఇస్తామని హామీలు ఇచ్చాయి. ఇలా దేశ రాజధానిలో మహిళల ఓట్ల కోసం పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఈ ఉచితాల హామీలపై మీ కామెంట్?
News January 18, 2025
శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే?
AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈవో శ్రీనివాసరావు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, ట్రాఫిక్, పార్కింగ్ వంటివాటిపై దృష్టి పెట్టాలని సూచించారు.
News January 18, 2025
మరో 63 అన్న క్యాంటీన్లు
AP: రాష్ట్రంలో కొత్తగా 63 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే వీటి ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవనున్నారు. ఏ ప్రాంతాల్లో ప్రారంభిస్తారనే విషయమై ఈ నెలఖారులోగా క్లారిటీ వచ్చే అవకాశముంది. కూటమి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రారంభించగా ప్రస్తుతం 203 అందుబాటులో ఉన్నాయి.