News August 10, 2024
దౌల్తాబాద్: చిన్నారులపై పిచ్చికుక్కల దాడి

వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తూ పిల్లలపై దాడులు చేస్తున్నాయి. దౌల్తాబాద్ మండలంలో శనివారం ఐదుగురు చిన్నారులను గాయపరిచాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని గోవిందపూర్ గ్రామంలో ఆరు బయట ఆడుకుంటున్న ఐదుగురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. స్థానికులు అప్రమత్తమై కుక్కలను తరిమివేయడంతో పిల్లలకు ప్రాణాపాయం తప్పింది. పిల్లలకు తీవ్రగాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Similar News
News March 26, 2026
కౌడిపల్లి: ఫిట్స్‌తో పొలంలో రైతు మృతి

కౌడిపల్లి మండలం బుజరంపేట(పిర్యా) తండాలో విషాదం నెలకొంది. పొలంలో పనులు చేసుకుంటుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో రైతు సమ్యా నాయక్ మరణించినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఫిట్స్ రావడంతో ఆయన అదుపు తప్పి పొలంలోని బురదలో పడిపోయారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ముఖం బురదలో కూరుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైతు మృతితో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News March 25, 2026
గ్రామీణులకు చేరువలోనే నాణ్యమైన వైద్యం: రాజనర్సింహ

TVVPని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చడం ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఈ మార్పుతో ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు, ప్రభుత్వ హోదా వంటి ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. జిల్లా ఆస్పత్రుల అభివృద్ధితో హైదరాబాద్‌పై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని చెప్పారు.
News March 25, 2026
మెదక్: కోర్టు పార్కింగ్ నిర్వహణకు టెండర్ల ఆహ్వానం

మెదక్ జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో వాహనాల(2/3/4 wheelers) పార్కింగ్ నిర్వహణ కోసం సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. ఆసక్తి గల వారు ఏప్రిల్ 6 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ టెండర్ కాలపరిమితి ఏడాది పాటు (మే 1, 2026 నుంచి ఏప్రిల్ 30, 2027 వరకు) ఉంటుంది. సీల్డ్ టెండర్లు తెరిచిన అనంతరం బహిరంగ వేలం ద్వారా కాంట్రాక్ట్ కేటాయిస్తారు.


