News August 10, 2024
అనంత: ఆటో డ్రైవర్ సూసైడ్

అప్పుల బాధ తాళలేక పామిడికి చెందిన ఆదినారాయణ అనే ఆటో డ్రైవర్ శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తలవాల కాలనీకి చెందిన ఆదినారాయణ ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. అయితే అప్పులు అధికమయ్యాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 31, 2025
ATP: లోక్ అదాలత్ ద్వారా 12,326 కేసులు పరిష్కారం

అనంతపురం జిల్లాలో లోక్ అదాలత్ ద్వారా ఈ ఏడాది 12,326 కేసులు పరిష్కారమైనట్లు SP జగదీష్ బుధవారం వెల్లడించారు. వివిధ కేసుల్లో 61 మందికి శిక్షలు పడ్డాయన్నారు. నిబంధనల ఉల్లంఘనపై రూ.1.35 లక్షల ఈ-చలానాలు విధించి రూ.3.93 కోట్ల జరిమానా వసూలు చేశారు. డ్రోన్లతో నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. డయల్ 100 ద్వారా కేవలం 12 నిమిషాల్లో స్పందించి బాధితులకు అండగా నిలుస్తున్నట్లు SP వివరించారు.
News December 31, 2025
2025 అనంతపురం జిల్లా క్రైమ్ రిపోర్ట్ విడుదల

* 2024తో పోలిస్తే 2025లో నేరాలు 22.5 శాతం తగ్గుదల
* కేసులు 8,841 నుంచి 6,851కు తగ్గుముఖం
* 55 శాతం చోరీ కేసులు రికవరీ
* జిల్లాలో 42 హత్యలు
* గణనీయంగా తగ్గిన మహిళలపై నేరాలు, పోక్సో కేసులు
* మిస్సింగ్ కేసుల్లో 613 మంది సురక్షితం
* 9 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు
* 544 నుంచి 496కు తగ్గిన ప్రమాదాలు
* 22 మందికి గంజాయి కేసుల్లో జైలు శిక్ష పడేలా చర్యలు
News December 31, 2025
అనంతపురంలో ‘అనంత పాల ధార’ అవగాహన కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనంత పాల ధార అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జేడీ ప్రేమ్ చంద్ తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. జనవరి 7, 8, 9 తేదీల్లో పశు పోషకులకు పాల దిగుబడి పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. వెటర్నరీ వైద్యులు ఈ పోటీలపై తమ పరిధిలోని రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పోటీలతో పశుగ్రాసం, పాల ఉత్పత్తి పెంపుపై రైతులకు అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు.


