News August 10, 2024
కడప జిల్లాలో TODAY TOP NEWS

*అంబేడ్కర్‌ను అవమానించారు: ఆంజాద్ బాషా
*మైదుకూరులో పర్యటించిన కలెక్టర్
* రాజంపేట అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన
*అవుకు నుంచి గండికోటకు నీటి విడుదల
* కడపలో ప్రారంభం కానున్న డీమార్ట్
*పులివెందులలో బండలాగుడు పోటీలు
*కడప జిల్లాలో మరో నెలపాటు వేట నిషేధం
*సుండుపల్లెలో 8 మంది అరెస్ట్
*ముద్దనూరులో మహిళ సూసైడ్
Similar News
News January 28, 2026
ఖాజీపేట: ‘మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడు’

ఖాజీపేట (M) బి.కొత్త పల్లె గ్రామానికి చెందిన ముత్తూర్ హృషి కేశవ రెడ్డి గ్రూప్ 2 (ఏఎస్ఓ జిఏడి)ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈయన గతంలో 2019-23 వరకు కూనవారి పల్లె గ్రామ సచివాలయ సెక్రెటరీగా, 2023లో బ్రహ్మంగారిమఠంలో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం గ్రూప్ -2 లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, (సాధారణ పరిపాలన శాఖ) ఉద్యోగం లభించింది. ఈయన మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం విశేషం.
News January 27, 2026
ప్రొద్దుటూరు: సీఐ శ్రీరామ్‌కు లూప్ లైన్ కొత్తేమీ కాదు.!

ప్రొద్దుటూరు 1టౌన్ సీఐ శ్రీరామ్ కు లూప్ లైన్ అనేది కొత్తేమీ కాదు. ప్రతి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ మధ్య ఆయన్ను లూప్ లైన్లో ఉంచారు. అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో VRలో పెట్టారు. అదే జిల్లాల్లో DCRBలోను ఉంచారు. కడప, తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ విభాగంలోను ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ బృందంలో కీలక అధికారిగా శ్రీరామ్ ఉన్నారు.
News January 27, 2026
ప్రొద్దుటూరు 1 టౌన్ CI బదిలీ

ప్రొద్దుటూరు 1 టౌన్ <<18970409>>CI శ్రీరామ్ బదిలీ <<>>అయ్యారు. ఒకటిన్నర నెల క్రితం ఆయన బాధ్యతలు స్వీకరించగా.. చట్టానికి వ్యతిరేకంగా ఉన్నవారిపై ఉక్కుపాదం మోపారు. దీంతో ఆయనపట్ల అధికార పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉండగా ఆ విషయం MLA దృష్టికి తీసుకుని వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం నూతన సీఐగా TV కొండారెడ్డిని నియమిస్తూ అన్నమయ్య SP ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన RSASTF-అన్నమయ్యలో పనిచేస్తున్నారు.


