News August 10, 2024
లంచంగా ‘ఆలుగడ్డలు’.. SI సస్పెండ్!

టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా? అవును. యూపీలోని ఓ ఎస్సై లంచాన్ని కోడ్ భాషలో ‘ఆలుగడ్డలు’ అని అడిగి బుక్ అయ్యారు. భావల్‌పూర్ ఎస్సై రాంకృపాల్ సింగ్ ఓ కేసును పరిష్కరించేందుకు రైతుకు ఫోన్ చేసి 5 కేజీల బంగాళాదుంపలు కావాలని డిమాండ్ చేశాడు. తాను అంత ఇవ్వలేనని, 2 కేజీలు ఇస్తానని బాధితుడు చెప్పాడు. ఆఖరికి 3 కేజీలకు సెటిల్మెంట్ అయింది. ఈ ఆడియో వైరల్ కావడంతో ఎస్సైని అధికారులు సస్పెండ్ చేశారు.
Similar News
News January 15, 2026
విజయ్ దేవరకొండ.. మీసాలు మెలేసి ట్రెడిషనల్ లుక్‌లో..

సినీ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెలేసిన మీసాలు, కళ్లద్దాలతో ఆయన కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సంబరాలను విలేజ్‌లో జరుపుకుందామని తన తల్లికి ప్రామిస్ చేశానన్నారు. విజయ్ ప్రస్తుతం <<18643470>>’రౌడీ జనార్ధన’<<>>తో పాటు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు.
News January 15, 2026
BISAG-Nలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్(BISAG-N)లో 6 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్( కంప్యూటర్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, సివిల్ ఇంజినీరింగ్), ఎంఈ, ఎంటెక్(అర్బన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్) అర్హత కలిగిన వారు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bisag-n.gov.in/
News January 15, 2026
కలుపు మందుల పిచికారీ – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఏ పంటకు సిఫార్సు చేసిన కలుపు మందులను ఆ పంటలో మాత్రమే సరైన మోతాదులో ఫ్లాట్ ప్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్‌ను ఉపయోగించి పిచికారీ చేయాలి. కలుపు మందులను ఇతర రసాయనాలతో (కీటక/శిలింద్రనాశినులు/పోషకాలు) కలిపి ఉపయోగిస్తే కలుపు మందుల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పంట మొలకెత్తాక ఉపయోగించే కలుపు మందులను.. కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారి చేసి సమర్థవంతంగా అరికట్టవచ్చు.


