News August 11, 2024
MLG: హాస్టల్ ఘటనపై సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క
మలక్‌పేట హాస్టల్ ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. కేసు విచారణ త్వరితగతిన పూర్తిచేసి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షపడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదని, కఠినంగా వ్యవహరిస్తుందని సీతక్క చెప్పుకొచ్చారు.
Similar News
News November 5, 2024
రాహుల్ గాంధీని కలిసిన మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లతో కలిసి మంత్రి కొండా సురేఖ కలిశారు. అనంతరం పలు అంశాలపై రాహుల్ గాంధీ, నేతలతో మంత్రి కొండా సురేఖ చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్ మున్సి, తదితరులు ఉన్నారు.
News November 5, 2024
WGL: KU ఫీజు చెల్లింపునకు రేపే ఆఖరు
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు రేపటితో ముగియనున్నట్లు KU అధికారులు తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 11 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
News November 5, 2024
మాల విరమణకు బయలుదేరిన నాగేంద్ర స్వామి మాలధారణ స్వాములు
గీసుకొండ మండలంలోని నాగేంద్ర స్వామి దేవాలయంలో 41 రోజుల మండల దీక్షలు తీసుకున్న నాగేంద్ర స్వామి భక్తులు నాగుల చవితి సందర్భంగా ఈరోజు మాలవిరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా భక్తులు పాల కావడులతో ఊరేగింపుగా తిరిగి మంగళ వాయిద్యాలతో దేవాలయానికి చేరుకున్నారు. నాగేంద్ర స్వామి దేవాలయం హరోం హర అనే నినాదాలతో మార్మోగింది.