News August 11, 2024

కమాండ్ కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేసిన ప్రకాశం ఎస్పీ

image

ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఎస్పీ శనివారం తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్‌లో ఉన్న డయల్ -112/100, టీవీ న్యూస్ వాచింగ్, VHF సెట్ పనితీరు, పోలీస్ వాట్సాప్, CCTV పనితీరు వివరాలను గురించి సిబ్బందిని ఆరా తీసి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎస్పీ సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రజలుకు ఎదురయ్యే వివిధ సమస్యలు, ఇబ్బందులు గురించి వెంటనే పరిష్కరించేలా చూడాలని తెలియజేశారు.

Similar News

News March 10, 2026

మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాల పేరిట రూ.కోటి టోకరా..?

image

మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ వ్యక్తి నమ్మబలికి రూ.కోటికి పైగా వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులుగా చేర్పించడానికి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. గత ఏడాదిగా నియమకాలు లేకుండానే పనులు చేయించుకుంటున్నట్లు తెలిసింది. 15 నెలలు అవుతున్నా ఉద్యోగం రాకపోవడంతో తమ డబ్బులు వెనకకు ఇవ్వాలని బాధితులు అడగడంతో ఈ వ్యవహారం బయటపడింది.

News March 10, 2026

ప్రకాశం జిల్లాలో మిస్సింగ్ కేసులపై దృష్టి

image

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్‌కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

News March 10, 2026

మిస్సింగ్ కేసుల చేదనకు ప్రత్యేక దృష్టి సారించాలి: ప్రకాశం SP

image

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్‌కి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల చేధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.