News August 11, 2024

థియేటర్‌లో పెళ్లి.. స్పందించిన డైరెక్టర్

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కృష్ణవంశీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మురారి’ మూవీ రీరిలీజ్‌లో దుమ్మురేపుతోంది. థియేటర్ల వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో మురారి ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్‌లో ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. దీనిపై కృష్ణవంశీ ఘాటుగా స్పందించారు. ‘ఇది చాలా చెత్త నిర్ణయం. మన సంస్కృతి, సంప్రదాయాలను అవమానించడమే. దయచేసి ఇలాంటివి మళ్లీ రిపీట్ చేయొద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News January 26, 2026

రేపు బ్యాంకులు బంద్!

image

బ్యాంక్ ఉద్యోగులు రేపు బంద్‌కు పిలుపునిచ్చారు. వారంలో 5 వర్కింగ్‌ డేస్‌ను డిమాండ్ చేస్తూ బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. జనవరి 23న ఈ మేరకు ప్రకటన వెలువడింది. గత బుధవారం, గురువారం ఈ విషయంపై చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మె యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది! ఇప్పటికే పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు తమ సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చంటూ కస్టమర్లకు మెసేజ్‌లు పంపాయి.

News January 26, 2026

రాజ్యాంగంలో ప్రతి పేజీపై ‘PREM’.. ఆయన ఎవరంటే?

image

భారత రాజ్యాంగ మూల ప్రతిలో ప్రతి పేజీపై ‘ప్రేమ్’ అనే పేరు ఉండటాన్ని ఎప్పుడైనా గమనించారా? ఆయనెవరో కాదు.. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. రాజ్యాంగ మూల ప్రతిని తన చేతిరాతతో రాసిన కళాకారుడు. దాదాపు 6 నెలల సమయాన్ని కేటాయించి అందంగా రాశారు. 251 పేజీలలో రాజ్యాంగాన్ని పూర్తి చేయగా.. ఎటువంటి వేతనం తీసుకోలేదు. బదులుగా ప్రతి పేజీపై తన పేరు, చివరి పేజీలో తన తాత పేరును రాసుకునేలా ఒప్పందం చేసుకున్నారు.

News January 26, 2026

ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ అప్డేట్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ‘డ్రాగన్’ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. RFCలో జరిగిన చిత్రీకరణలో నైట్ ఎఫెక్ట్ సీన్లు తీసినట్లు సినిమాటోగ్రఫీ విభాగంలో పనిచేస్తోన్న ప్రజ్వల్ ఇన్‌స్టాలో వెల్లడించారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీలో యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉంటాయని సినీవర్గాలు చెబుతున్నాయి. NTR కెరీర్‌లోనే అత్యుత్తమ సినిమాగా ‘డ్రాగన్’ ఉండనున్నట్లు సమాచారం.