News August 11, 2024
4×400 మీ.రిలేలో దుమ్మురేపిన అమెరికా
పారిస్ ఒలింపిక్స్‌లో 4×400 మీ.రిలేలో అమెరికా దుమ్మురేపింది. పురుషులు, మహిళలు రెండు విభాగాల్లోనూ ఆ దేశం స్వర్ణ పతకాలు కొల్లగొట్టింది. పురుషుల టీమ్ 2:54.53 నిమిషాలు, మహిళల జట్టు 3:15.27 నిమిషాల్లో రన్నింగ్ ముగించాయి. మెన్స్ పోటీల్లో బోట్స్వానా వెండి, గ్రేట్ బ్రిటన్ కాంస్యంతో సరిపెట్టుకున్నాయి. అలాగే వుమెన్స్ కేటగిరీలో నెదర్సాండ్స్ వెండి, గ్రేట్ బ్రిటన్ కాంస్యం దక్కించుకున్నాయి.
Similar News
News February 7, 2025
సోనూసూద్ అరెస్ట్‌కు వారెంట్
నటుడు సోనూసూద్‌కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. మోహిత్ అనే వ్యక్తి ‘రిజికా కాయిన్’లో పెట్టుబడి పేరుతో ₹10L మోసం చేశాడని, దీనికి సోనూసూద్ సాక్షి అని పేర్కొంటూ రాజేశ్ అనే లాయర్ కేసు వేశారు. కోర్టు పంపిన సమన్లకు సోనూసూద్ స్పందించకపోవడంతో జడ్జి తీవ్రంగా స్పందించారు.
News February 7, 2025
నేడు క్యాబినెట్లో కొత్త ఐటీ బిల్లుపై చర్చ, ఆమోదం!
1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లు రూపకల్పన పూర్తయినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. దీనిపై ఇవాళ క్యాబినెట్లో చర్చించి ఆమోదించనున్నారని పేర్కొన్నాయి. వారంలో లోక్‌సభలో ప్రవేశపెడతారని చెప్పాయి. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కొత్త బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందరికీ అర్థమయ్యేలా IT రేట్లు, శ్లాబులు, TDS నిబంధనలు ఉంటాయని వెల్లడించారు.
News February 7, 2025
English Learning: Antonyms
✒ Immense× Puny, Insignificant
✒ Immaculate× Defiled, Tarnished
✒ Imminent× Distant, Receding
✒ Immerse× Emerge, uncover
✒ Impair× Restore, Revive
✒ Immunity× Blame, Censure
✒ Impediment× Assistant, Concurrence
✒ Impartial× Prejudiced, Biased
✒ Impute× Exculpate, support