News August 11, 2024
నేడు ఒలింపిక్స్ ముగింపు వేడుకలు

పారిస్ ఒలింపిక్స్ పోటీలు నేటితో ముగియనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 గంటలకు విశ్వ క్రీడల ముగింపు వేడుకలు జరగనున్నాయి. స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో క్లోజింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు. ప్రముఖ పాప్ సింగర్ H.E.R ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. కాగా ఈ వేడుకల్లో ఇండియన్ ఫ్లాగ్ బేరర్లుగా మనూ భాకర్, శ్రీజేశ్ వ్యవహరించనున్నారు.
Similar News
News March 26, 2026
పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.
News March 26, 2026
రోజూ కాసేపు హాయిగా నవ్వితే..

నవ్వు బెస్ట్ మెడిసిన్ అంటున్నారు వైద్యులు. రోజూ కాసేపు మనస్ఫూర్తిగా నవ్వితే ఫిజికల్, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడి, కోపం తగ్గుతాయంటున్నారు. ‘10-15ని.లు నవ్వితే 40 క్యాలరీలు ఖర్చవుతాయి. ఫీల్ గుడ్ హార్మోన్లయిన ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. రోగనిరోధక శక్తి, రక్త నాళాల పనితీరు మెరుగుపడుతుంది. గుండె సమస్యలు, BP తగ్గుతాయి. క్యాన్సర్‌పై పోరాటంలోనూ సాయపడుతుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt
News March 26, 2026
BREAKING: పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,46,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.1,34,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షలుగా ఉంది.


