News August 11, 2024
మన్యంకొండలో భక్త జనసందోహం

పేదల తిరుపతి మన్యంకొండకు భక్తులు పోటెత్తారు. ఈనెల 5 నుంచి మన్యంకొండలో శ్రావణ మహోత్సవ పూజలు ప్రారంభమయ్యాయి. దీంతో తొలి శనివారం కావడంతో ఉమ్మడి పాలమూరు నుంచే కాగా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు కోనేరులో స్నానాలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని ఆలయ అధికారులు తెలిపారు.
Similar News
News December 27, 2025
MBNR:GET READY.. సాఫ్ట్ బాల్ జట్టు సిద్ధం

ఉమ్మడి మహబూబ్ నగర్ సాఫ్ట్ బాల్ బాలికల జట్టు రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమైంది. మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగే అండర్-19 SGF సాఫ్ట్ బాల్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు బయలుదేరింది. విజేతగా నిలవాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) కార్యదర్శి డాక్టర్ శారదాబాయి ఆకాంక్షించారు. ఈనెల 28 వరకు పోటీలు జరగనున్నాయి. పీడీలు వేణుగోపాల్, సరిత, నాగరాజు, లక్ష్మీనారాయణ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
News December 27, 2025
MBNR:CM ప్రకటన..1,683 GPలకు లబ్ది

నిధులు లేక నీరసించిన పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులను నేరుగా సర్పంచ్లకే అందిస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా చిన్న జీపీలకు రూ.5 లక్షలు, పెద్ద జీపీలకు రూ. 10 లక్షలు అందిస్తామని సీఎం ప్రకటించడంతో సర్పంచ్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1,683 గ్రామపంచాయతీలకు లబ్ధి చేకూరనున్నది.
News December 27, 2025
MBNR:T-20 క్రికెట్ లీగ్..మ్యాచ్ ల వివరాలు ఇలా!

MBNRలోని ఎండీసీఏ మైదానంలో జి.వెంకటస్వామి మెమోరియల్ ఉమ్మడి జిల్లా “టీ-20 క్రికెట్ లీగ్” ప్రశాంతంగా ముగిసిందని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం ఐదు జట్లు పాల్గొన్నాయి. ఒక్కొక్క జట్టు 4 మ్యాచ్లు ఆడింది.
✒జట్ల పాయింట్ల వివరాలు ఇలా!!
1.మహబూబ్ నగర్:6(LWWW)
2.నాగర్ కర్నూల్:6(WLWW)
3.గద్వాల్:4(LWLW)
4.నారాయణపేట:4(WWLL)
5.వనపర్తి:0(LLLL)


