News August 11, 2024
తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఏటీజీహెచ్ అతిథి గృహం వరకు భక్తులు లైన్‌లో వేచి ఉన్నారు. నిన్న 79,313 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 39,344 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం నిన్న రూ.3.65కోట్లు వచ్చింది.
Similar News
News October 15, 2025
ఇండో-అమెరికన్ ఆష్లీ టెల్లిస్ అరెస్ట్

ఇండో అమెరికన్ ఆష్లీ టెల్లిస్(64)ను వర్జీనియాలో అరెస్టు చేశారు. ఆయన US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌లో సీనియర్ అడ్వైజర్‌గా ఉన్నారు. ఆయన జాతీయ రక్షణకు సంబంధించి టాప్ సీక్రెట్స్ దొంగిలించారని, చైనా అధికారులను కలిశారని ఆరోపణలు ఉన్నట్లు US మీడియా పేర్కొంది. ఈయన ముంబైలో జన్మించారు. ఆష్లీ టెల్లిస్ విదేశాంగ విధాన నిపుణుడు, వ్యూహకర్త. అంతర్జాతీయ భద్రత, రక్షణ, ఆసియా వ్యూహాత్మక అంశాలపై విశేష ప్రావీణ్యం ఉంది.
News October 15, 2025
ప్రతి విద్యార్థి స్కూల్లో ఉండాలి: భట్టి విక్రమార్క

TG: విద్యారంగం ప్రతిష్టాత్మకమైందని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో Dy.CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ప్రగతిపై సమీక్షించారు. ‘పథకంలో సమస్యలుంటే యాజమాన్యాలు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలి. విద్యార్థులను పంపేయడానికి వీల్లేదు. ఈ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలి’ అని భట్టి ఆదేశించారు.
News October 15, 2025
GDP గ్రోత్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా భారత్

ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్(IMF) 2025కు గాను ఇండియా GDP గ్రోత్‌ను రివైజ్ చేసింది. ఈ ఏడాదికి 6.4% గ్రోత్ ఉంటుందని పేర్కొన్న IMF దానిని 6.6%కు పెంచింది. 2026లో అది 6.2% ఉంటుందని అంచనా వేసింది. ఎమర్జింగ్ మార్కెట్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇదే అత్యధికం. గ్లోబల్ గ్రోత్ ఈ ఏడాది 3.2% కాగా, వచ్చే ఏడాది 3.1%కు తగ్గొచ్చంది. US గ్రోత్ ఈ ఏడాది 2.0% ఉండగా 2026లో 2.1%కు పెరగొచ్చని తెలిపింది.