News August 11, 2024

బల్లికురవ: వాటర్ ట్యాంక్ పైనపడి చిన్నారి మృతి

image

బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వల్లాపల్లిలో శనివారం ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్ పైనపడి చిన్నారి షేక్ ఆసియా మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శనివారం ఆసియా ఇంటి బయట కూర్చుని ఉండగా, ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ గాలికి కిందపడింది. దీంతో అక్కడే కూర్చుని ఉన్న పాపకు తీవ్ర గాయాలు కాగా.. 108లో నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

Similar News

News March 4, 2026

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

image

చీమకుర్తి (M)లో బుధవారం దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బూదవాడలోని గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలో ఇద్దరు రాజస్థాన్ కార్మికుల మధ్య జరిగిన ఆర్థిక వివాదం హత్యకు దారి తీసింది. హత్యకు గురైన వ్యక్తి ఓం ప్రకాశ్ (35)గా గుర్తించారు. హత్య చేసిన వ్యక్తిని చీమకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రూ.2వేల కోసం ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 4, 2026

మళ్లీ ఘాటెక్కిన ఒంగోలు రాజకీయం

image

ఒంగోలు రాజకీయం మళ్లీ ఘాటెక్కింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. డ్వాక్రా గ్రూపుల్లో అవినీతి జరిగిందని, అది ఎవరు చేశారో ఒంగోలులోని ప్రజలకు తెలుసు అని బాలినేని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై ఫిర్యాదు చేశామని, ఆయన కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నారని, కలెక్టర్‌తో స్పెషల్ ఎంక్వైరీ వేపించుకోవాలని దామచర్ల సమాధానం ఇచ్చారు.

News March 4, 2026

ప్రకాశం: తౌషిక్ మృతి.. పాఠశాలకు షోకాజ్ నోటీస్

image

ప్రకాశం(D) S.కొండ చైతన్య పాఠశాలలో ఇటీవల 6వ తరగతి విద్యార్థి తౌషిక్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ త్రిసభ్య కమిటీతో విచారణకు ఆదేశించారు. కమిటీ పాఠశాలను సందర్శించి అనేక లోపాలను గుర్తించింది. నివేదికను పరిశీలించిన DEO రేణుకకు ఇవ్వగా ఆమె పాఠశాల యాజమాన్యానికి మంగళవారం షోకాజ్ జారీచేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల గుర్తింపును ఎందుకు రద్దు చేయరాదో తెలపాలన్నారు.