News August 11, 2024

కేంద్ర మంత్రి భోగాపురం షెడ్యూల్ ఇదే

image

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం ఉదయం 10-30 గంటలకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ ప్రాంతాన్ని సందర్శిస్తారు. టెర్మినల్, ఏటీసీ నిర్మాణాలు, రన్ వే నిర్మాణం పనులను పరిశీలిస్తారు. అనంతరం GMR, L&T ప్రతినిధులతో, జిల్లా అధికారులతో పనులపై సమీక్షిస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి పాల్గొంటారు.

Similar News

News March 25, 2026

విజయనగరం జిల్లా MLAలకు టెన్షన్.. టెన్షన్!

image

విజయనగరం జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం రాజాం ఒక్కటే SC నియోజకవర్గం. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.

News March 25, 2026

పెండింగ్ ఈ-చలానాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి: ఎస్పీ

image

జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనదారులు ఈ-చలానాలను చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీసు సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. పెండింగ్ ఈ-చలానాలను వసూలు చేసేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.