News August 11, 2024

అడగ్గానే అపాయింట్‌మెంట్.. సీఎం చంద్రబాబుపై ప్రశంసలు

image

పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ Xలో అడగ్గానే అపాయింట్‌మెంట్ ఇచ్చిన AP CM చంద్రబాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండు విషయాలపై చర్చించాలని, అందుకు సీఎం అపాయింట్‌మెంట్ కావాలని ఆమె ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన CM CBN ఈనెల 13న మ.2గంటలకు అపాయింట్‌మెంట్ ఇస్తూ రిప్లై ఇచ్చారు. ‘TNలో పార్టీ నాయకుడిని కలవడమే కష్టం. అపాయింట్‌మెంట్ పొందడం అసాధ్యం’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

Similar News

News March 20, 2026

పెరిగిన ‘పవర్’ పెట్రోల్ ధర

image

దేశవ్యాప్తంగా ‘పవర్’ పెట్రోల్ ధర పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలైన HPCL, BPCL, IOCL లీటర్‌పై రూ.2.09-రూ.2.35 వరకు వడ్డించాయి. ఈరోజు నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. నార్మల్ పెట్రోల్ రేట్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల క్రూడాయిల్ సరఫరా తగ్గడంతో రేట్లు సవరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వంటగ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

News March 20, 2026

గుడ్ న్యూస్: డెయిరీ, గొర్రెల ఫారాలకు ఛార్జీల రద్దు

image

AP: రాష్ట్రంలోని డెయిరీ, గొర్రెలు, మేకలు, పందుల పెంపకందారుల నుంచి వసూలు చేస్తున్న బెటర్‌మెంటు, డెవలప్మెంటు ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక నుంచి వీటిని మినహాయిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే వీటికి సంబంధించి మున్సిపాల్టీల పరిధిలోని బిల్డింగ్ పర్మిషన్, లైసెన్స్ ఫీజులను పంచాయతీలతో సమానం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ మినహాయింపులపై GO ఇచ్చారు.

News March 20, 2026

ఏప్రిల్ 1 నుంచి ఆ బ్యాంకుల ఏటీఎమ్ రూల్స్ ఛేంజ్!

image

ATM మనీ విత్‌డ్రాలపై HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోత విధించాయి. ఇప్పటివరకు సెపరేట్‌గా ఉన్న UPI విత్‌డ్రాల్స్‌ను రెగ్యూలర్ కార్డ్ విత్‌డ్రాల్‌తో HDFC కలిపేయనుంది. దీంతో ఫ్రీ లిమిట్ దాటితే ట్రాన్సాక్షన్‌కు ₹23 చొప్పున ఛార్జ్ పడుతుంది. ఇక PNB రూపే NCMC ప్లాటినమ్ డొమెస్టిక్ సహా పలు వేరియంట్లపై డైలీ విత్‌డ్రాల్ లిమిట్ ₹లక్ష నుంచి ₹50వేలుకు తగ్గించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి.