News August 11, 2024
కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డులు!
AP: రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మ్యారేజ్ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త జంటలకు వీటిని జారీ చేయనున్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డుల కోసం పలువురు ఎదురు చూస్తుండటంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త కార్డులను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, 89 లక్షల కార్డులకు కేంద్రం నిత్యావసరాలు అందిస్తోంది.
Similar News
News January 19, 2025
రేషనలైజేషన్‌ను తప్పుబడుతోన్న ఉద్యోగ సంఘాలు
AP: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపట్టాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని వల్ల ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. మల్టీపర్పస్ ఉద్యోగులు అనే పేరుతో వివిధ పనులకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలనుకోవడం సరికాదని పేర్కొన్నాయి.
News January 19, 2025
OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
విజయ్ సేతుపతి నటించిన ‘విడుదల పార్ట్-2’ OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పార్ట్-1 స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయింది. పార్ట్-1 కూడా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
News January 19, 2025
NDRF రైజింగ్ డే వేడుకలు.. పాల్గొననున్న షా, బాబు, పవన్
AP: నేడు విజయవాడ సమీపంలోని గన్నవరంలో NDRF రైజింగ్ డే వేడుకలు జరగనున్నాయి. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. కొండపావులూరులో NDRF, SDRF ప్రాంగణాలను షా ప్రారంభించనున్నారు. అనంతరం HYD పోలీస్ అకాడమీలో రూ.27 కోట్లతో నిర్మించనున్న షూటింగ్ రేంజ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.