News August 11, 2024
పుష్ప-2లో జాతర ఫైట్‌కు మించిన క్రేజీ సీక్వెన్స్?

సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో జాతర ఫైట్ సీక్వెన్స్ మూవీపై అంచనాలను పెంచగా, అంతకుమించిన మరో యాక్షన్ పార్ట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. క్లైమాక్స్‌లో హెలికాప్టర్ రిలేటెడ్‌గా ఉండే ఈ సీక్వెన్స్ అదిరిపోతుందని సమాచారం. దీన్ని సుకుమార్ తన స్టైల్‌లో డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదల కానున్న విషయం తెలిసిందే.
Similar News
News December 28, 2025
ESIC హాస్పిటల్ తిరునెల్వేలిలో ఉద్యోగాలు

ESIC హాస్పిటల్, తిరునెల్వేలి 27 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, PG, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 5న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. స్పెషలిస్ట్ పోస్టులకు గరిష్ఠ వయసు 67ఏళ్లు కాగా.. Sr. రెసిడెంట్(3Yr కాంట్రాక్ట్)కు 45ఏళ్లు, Sr. రెసిడెంట్(1Yr కాంట్రాక్ట్)కు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: rodelhi.esic.gov.in/
News December 28, 2025
‘మన్ కీ బాత్’లో నరసాపురం ప్రస్తావన

AP: ‘మన్ కీ బాత్’లో PM మోదీ ఏపీలోని నరసాపురం ప్రస్తావన తీసుకొచ్చారు. దేశంలోని సంప్రదాయ కళల అంశంపై మాట్లాడుతూ లేస్(అల్లికలు) గురించి ప్రస్తావించారు. ఈ కళ తరతరాలుగా మహిళల చేతుల్లో ఉందని చెప్పారు. నరసాపురం లేస్‌కు జీఐ ట్యాగ్ ఉందని తెలిపారు. కాగా సుమారు 500 రకాల ఉత్పత్తుల తయారీలో లక్ష మంది మహిళలు భాగమవుతున్నారు. హ్యాంగింగ్స్, డోర్ కర్టెన్లు, సోఫా కవర్లు, కిడ్స్‌వేర్‌లో ఈ లేస్‌ను వినియోగిస్తారు.
News December 28, 2025
90 పైసలకే 50 ఎకరాలా: పేర్ని నాని

AP: చంద్రబాబు నోట PPP, P4 మాటలే వస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పీపీపీ టెండర్లకు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే వారు వ్యాపారం మాత్రమే చేస్తారనే విషయాన్ని మర్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖలో భూములు దోచుకుంటున్నారని, 90 పైసలకే 50 ఎకరాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సామాన్యులు, పేదల పట్ల చంద్రబాబు దృక్పథం మారట్లేదన్నారు.


