News August 11, 2024
కడప: 28 మంది MPDOలకు పోస్టింగ్

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈసీఐ నిబంధనల మేరకు ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంపీడీఓలు తిరిగి సొంత జిల్లాకు చేరుకున్నారు. ఇంతకుముందు పనిచేసిన మండలాల్లోనే వీరికి తిరిగి పోస్టింగ్ ఇస్తూ జెడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 మంది ఎంపీడీవోలు బదిలీపై రానున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News March 21, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,800
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,616
*వెండి 10 గ్రాముల ధర రూ.2310
News March 20, 2026
సిద్ధవటంలో కనిపించిన నెలవంక.. రేపే రంజాన్

సిద్ధవటంలో శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం రంజాన్ పర్వదినం (ఈదుల్ ఫితర్) జరుపుకోనున్నారు. ఉదయం 10.15 గంటలకు సిద్ధవటం శివారులోని ఈద్గాలో జమాఅత్ ప్రారంభమై అనంతరం ప్రత్యేక నమాజ్ నిర్వహించనున్నట్లు ముత్తవల్లి సయ్యద్ నజరే ఆలం ఖాద్రి తెలిపారు. నెల రోజుల పాటు ముస్లింలు పాటించిన కఠోర ఉపవాసాలు నేటితో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.
News March 20, 2026
రైతుల నుంచి అధికంగా వసూలు చేస్తే చర్యలు: జ్యోతి

ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో రైతుల నుంచి క్వింటాలుకు రూ.75లు మించి వసూలు చేస్తే ఇన్‌ఛార్జ్‌లపై చర్యలు తీసుకుంటామని మార్క్ ఫెడ్ డీఎం పరిమళ జ్యోతి హెచ్చరించారు. ప్రొక్యూర్ మెంట్ కేంద్రాల్లో రైతులందరికీ బహిరంగంగా కనిపించేలా ఛార్జీల వివరాలను, ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.


