News August 11, 2024
‘నల్గొండ’కు జ్వరమొచ్చింది!

జిల్లా వ్యాప్తంగా విషజ్వరాల బారిన పడి ప్రజలు విలవిలలాడుతున్నారు. జిల్లాలో ఇటీవల ముసురుతో కూడిన వర్షాలతో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేయడంతో దోమల వ్యాప్తి పెరిగింది. దీంతో జిల్లాలో ఎక్కువగా డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్ ప్రబలుతున్నాయి. కీళ్లనొప్పులు, కాళ్లు, ఒంటి నొప్పుల కారణంగా వందలాది మంది రోగులు నడవలేక అల్లాడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 466 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.
Similar News
News January 17, 2026
నల్గొండ తొలి మేయర్‌గా ‘ఆమె’

నల్గొండ కార్పొరేషన్ మేయర్ పదవి రిజర్వేషన్ ఖరారైంది. ప్రభుత్వం ఈ పదవిని ‘జనరల్ మహిళ’కు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయడంతో జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డాయి. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
News January 17, 2026
నల్గొండ: మునిసి’పోల్స్ ‘కు ముందస్తు ప్రచారం!

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ఆశావహులు ఓటర్ల తలుపు తడుతున్నారు. ఎన్నికల బరిలో నిలవడానికి రెడీ అయిన వారిలో చాలామంది వారం, పది రోజులుగా నల్గొండతో పాటు MLG పట్టణంలోని గల్లీల్లో తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాట పడుతున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న కొందరు కొంతకాలంగా వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
News January 17, 2026
NLG: రైతులకు మళ్లీ మొండి చేయేనా!

సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ఊరించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు స్పందించకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఈ యాసంగిలో జిల్లాలో 6.57 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మొండి చేయి చూపించడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. దీంతో అప్పుల కోసం రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.


