News August 11, 2024
మంత్రి సంధ్యారాణికి అంగన్వాడీల వినతి

ఫేస్ యాప్ ద్వారా లబ్ధిదారులను నమోదు చేసి, వారి ఫోన్‌లకు ఓటీపీ వచ్చిన తర్వాతే సరుకులు ఇచ్చేలా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు పైలెట్ ప్రాజెక్టుగా విజయనగరం, గంట్యాడలను ఎంపిక చేశారన్నారు. దీంతో పని భారం పెరుగుతుందన్నారు.
Similar News
News January 17, 2026
VZM: వాట్సాప్‌లో పోలీస్ సేవలు.. నంబర్ ఇదే!

విజయనగరం జిల్లాలో ప్రజలు ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా సేవలు పొందవచ్చని SP దామోదర్ శనివారం తెలిపారు. ‘మనమిత్ర’ విధానం ద్వారా FIR కాపీలు, ఈ-చలాన్ స్థితిని ఇంటి నుంచే తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో త్వరితగతిన సేవలు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
News January 17, 2026
రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి

శ్రీకాకుళం జిల్లా రణస్థలం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. మృతుడు నెల్లిమర్ల (M) తమ్మాపురం గ్రామానికి చెందిన కోటి(25)గా గుర్తించారు. తల్లిని శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. దీనిపై జె.ఆర్‌పురం పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 17, 2026
VZM: పండగకి ఇంత తాగేశారా..!

విజయనగరం జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో మందుబాబులు వైన్ షాపులు, బార్లకు క్యూ కట్టారు. ఏకంగా రూ.13.81 కోట్ల మద్యాన్ని ఫుల్‌గా తాగేశారు. జిల్లాలో 225 మద్యం షాపులు, 26 బార్లు ఉన్నాయి. ఈనెల 13,14 తేదీల్లో 52,090 కేసుల ఐఎంఎల్ మద్యం, 16న 485 బీర్ కేసుల విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.


