News August 11, 2024

శ్రీకాకుళం రోడ్డు వరకే పలాస మెము

image

పలాస-పూండి-నౌపడ-విజయనగరం సెక్టరులో ఆధునికీకరణ పనుల కారణంగా ఈనెల 15,17 తేదీల్లో విశాఖ-పలాస (07470) మెము ట్రైన్ శ్రీకాకుళం వరకు నడుస్తుందని అధికారులు వెల్లడించారు. తిరుగు ప్రయాణంలో పలాస-విశాఖ (07471) మెము ఈనెల 15,17 తేదీల్లో శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుందని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఆయా తేదీల్లో శ్రీకాకుళం, పలాస మధ్య రైలు ప్రయాణాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు.

Similar News

News March 11, 2025

శ్రీకాకుళంలో నిండు గర్భిణి మృతి..ప్రమాదం ఎలా జరిగిందంటే

image

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ నిండు గర్భిణి మృతి చెందిన ఘటన శ్రీకాకుళంలో జరిగిన విషయం తెలిసిందే. ఎచ్చెర్ల (M) కుంచాలకూర్మయ్యపేటకు చెందిన దుర్గరావు భార్య రాజేశ్వరి నిండు గర్భిణి. సోమవారం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా డే అండ్ నైట్ కొత్త జంక్షన్ వద్ద వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. భర్తపై బైక్ పడిపోగా, ఆమె తొడ భాగంపై నుంచి బస్సు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.

News March 11, 2025

ఎచెర్ల: స్పెషల్ డ్రైవ్ పరీక్షఫలితాలు విడుదల

image

ఎచ్చెర్ల మండలంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల ఇయర్ ఎండింగ్ స్పెషల్ డ్రైవ్ పరీక్ష ఫలితాలను సోమవారం రాత్రి యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పరీక్ష ఫలితాలు https://www.vidyavision.com/results/DRBRAUUG1st2nd3rdsemResults వెబ్‌సైట్‌ సందర్శించాలని తెలిపారు.

News March 11, 2025

శ్రీకాకుళం: జీరో పావ‌ర్టీ పీ-4 విధానం ప్రారంభం- కలెక్టర్

image

స్వర్ణాంధ్ర @ 2047 కార్యాచరణలో భాగంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన జీరో పావర్టీ-పీ4 విధానం ప్రక్రియ జిల్లాలో మొదలైందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్ (పీ4) విధానానికి ఉగాది నుంచి ప్రారంభం కానుందని కలెక్టర్ తెలిపారు.

error: Content is protected !!