News August 11, 2024
ఉమ్మడి తూ.గో జిల్లాలో రూ.191.84 కోట్ల బకాయిలు

ఉమ్మడి తూ.గో జిల్లాలోని రైతులకు రూ.191.84 కోట్ల ధాన్యం బకాయిలు ఈ నెల 12న విడుదల కానున్నాయి. తూ.గో జిల్లాలో 498.70 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. రూ.470.99 కోట్లు చెల్లించగా.. రూ.27.71 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాకినాడ జిల్లాలో రూ.56.75 కోట్లలో రూ.47.25 కోట్లు చెల్లించగా.. రూ.9.50 కోట్లు, కోనసీమ జిల్లాలో రూ.355.88 కోట్లకు, రూ.201.25 కోట్లు చెల్లించారు. రూ.154.63 కోట్లు చెల్లించాల్సి ఉంది.
Similar News
News August 24, 2025
సెప్టెంబర్ 1 నుండి నూతన పాలసీ: రాహుల్ దేవ్

సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి వస్తుందని ఏపీ ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. కొత్త పాలసీలో 10% బార్లను కల్లు గీత కార్మికులకు కేటాయించనున్నట్లు వెల్లడించారు. బార్లకు లైసెన్స్ ఫీజు తగ్గించడంతో పాటు వాయిదా పద్ధతుల్లో చెల్లింపులకు అవకాశం కల్పించారన్నారు. బార్ల పనివేళలు ఉదయం 10గం: నుంచి రాత్రి 12 గం: వరకు ఉంటాయన్నారు.
News August 24, 2025
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

రాజమండ్రిలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
News August 24, 2025
గోపాలపురంలో నేటి చికెన్ ధరలు

గోపాలపురంలో ఆదివారం చికెన్ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఈ వారం బ్రాయిలర్ చికెన్ ధర కిలో రూ.200 నుంచి రూ.220 వరకు పలికింది. స్కిన్లెస్ చికెన్ రూ.240, ఫారం మాంసం రూ.200, నాటుకోడి మాంసం రూ.400కు విక్రయించారు. దుకాణాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంతో కామెంట్ చేయండి.