News August 11, 2024
8 ఏళ్లలోనే 15 ఒలింపిక్ పతకాలు: పురందీశ్వరి

కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల దేశానికి ఒలింపిక్ పతకాల సంఖ్య పెరుగుతోందని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి అన్నారు. 1952 నుంచి 2012 వరకు ఇండియాకు 20 మెడల్స్ వస్తే 2016 నుంచి 2024 వరకు 8 ఏళ్లలోనే 15 పతకాలు వచ్చాయని ట్వీట్ చేశారు. ఖేలో ఇండియా, TOPS ద్వారా కేంద్రం అథ్లెట్లకు సపోర్ట్ చేస్తోందని వివరించారు.
Similar News
News December 28, 2025
వన్డేల్లోకి ఇషాన్ కిషన్ రీఎంట్రీ?

SMATలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ రెండేళ్ల తర్వాత తిరిగి వన్డేల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. JAN 11 నుంచి న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు ఆయనను ఎంపిక చేసే అవకాశం ఉందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. కిషన్ తన చివరి వన్డే 2023 అక్టోబర్లో అఫ్గానిస్థాన్తో ఆడారు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్లలో ఆయన ఒకరు. అటు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న టీ20 WCకు కిషన్ ఎంపికైన సంగతి తెలిసిందే.
News December 28, 2025
‘మా డాడీ ఎవరో తెలుసా?’ అని చెప్పొద్దు.. సజ్జనార్ వార్నింగ్

TG: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారు పలుకుబడిని ఉపయోగించాలని ప్రయత్నించవద్దని HYD సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ‘మా డాడీ ఎవరో తెలుసా?, మా అంకుల్ ఎవరో తెలుసా? అన్న ఎవరో తెలుసా? అని మా అధికారులను అడగొద్దు. మీ ప్రైవసీకి మర్యాద ఇస్తాం. వాహనం పక్కన పెట్టి, డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం’ అని తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News December 28, 2025
శీతాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

శీతాకాలంలో ఇమ్యునిటీ తగ్గడం వల్ల రోగాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజూ వ్యాయామం, ఉదయం లేచి ఒక గ్లాసు వేడినీరు తాగడం మంచిది. రోజుకు కనీసం 15 నిమిషాలు సూర్యకాంతిలో కూర్చోవాలి. క్యారెట్, బంగాళాదుంప, చిలకడదుంప , పాలకూర, మెంతి కూర, నారింజ, దానిమ్మ, యాపిల్, తృణధాన్యాలు, ఓట్స్, బార్లీ, బాదం, వాల్నట్స్ ఆహారంలో చేర్చుకోవాలి.


