News August 11, 2024

‘సోషల్ మీడియా’ బానిసగా మారుస్తోంది.. కెనడియన్ దావా

image

టిక్‌టాక్, యూట్యూబ్, రిడ్డిట్, ఇన్‌స్టా, FBలపై ఓ 24 ఏళ్ల కెనడియన్ కోర్టులో దావా దాఖలు చేశాడు. అవి మనుషులను బానిసలుగా మారుస్తున్నాయని, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నాడు. 2015 నుంచి SM వాడుతున్న తనలో పనిచేసే సామర్థ్యం తగ్గిందని, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపాడు. ఇది ప్రతి ఒక్కరి సమస్య అని చెప్పాడు. సోషల్ మీడియా యజమానులు యూజర్ల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాడు.

Similar News

News January 26, 2026

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన SP

image

చిత్తూరు క్యాంపు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ రిపబ్లిక్ డే పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని సోమవారం ఆవిష్కరించారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు. సిబ్బందికి ఆయన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్, ఎంటీఓ వీరేశ్ పాల్గొన్నారు.

News January 26, 2026

పనిమనిషిపై పదేళ్లుగా రేప్.. ధురంధర్ నటుడి అరెస్ట్

image

బాలీవుడ్ యాక్టర్ నదీమ్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై 10సం.లుగా రేప్‌కు పాల్పడ్డారని అతడి ఇంటి పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక, మానసిక వేధింపులకు గురైనా పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇంతకాలం బయటకు చెప్పలేదని పేర్కొంది. దీంతో పోలీసులు నటుడిని అదుపులోకి తీసుకున్నారు. మిమి, వాధ్, మై లడేగా తదితర మూవీల్లో నటించిన అతడు ‘ధురంధర్’లో అక్షయ్ ఖన్నా వంటమనిషి అఖ్లాక్‌గా నటించారు.

News January 26, 2026

క్లీనింగ్ టిప్స్

image

* పాత లెదర్ వస్తువులకు మెరుపు రావాలంటే కొద్దిగా వ్యాజలీన్ రాసి, మెత్తని వస్త్రంతో తుడవండి. * బాత్‌రూం అద్దాలపై సబ్బు నీళ్ళ మరకలు పడితే, వెనిగర్‌లో ముంచిన స్పాంజితో రుద్ది చూడండి. * చెక్క వస్తువులపై గీతలు పడితే వెనిగర్, వంట నూనె మిశ్రమంలో ముంచి తీసిన వస్త్రంతో తుడిస్తే మరకలు పోతాయి. * ఖరీదైన దుస్తులపై ఇంకు మరకలు పడితే కొద్దిగా బేకింగ్ సోడాతో రుద్ది, వెనిగర్‌లో ముంచి ఉతికితే త్వరగా పోతాయి.