News August 11, 2024
ఏపీలో మరిన్ని ఎయిర్‌పోర్టులు: రామ్మోహన్

AP: దగదర్తి(నెల్లూరు), కుప్పం, నాగార్జునసాగర్ వద్ద ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఆలోచిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ‘ఈ ప్రాజెక్టుకు ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే శక్తి ఉంది. గత నెల నుంచి ఇప్పటివరకు పనుల్లో 4% పురోగతి ఉంది. మొత్తం ఇప్పటివరకు 36% పనులు పూర్తయ్యాయి. గడువు కంటే ముందే నిర్మాణం పూర్తి చేస్తాం’ అని ఆయన వెల్లడించారు.
Similar News
News September 15, 2025
AI కంటెంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం?

ఏఐ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇకపై ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫొటోలు, ఆర్టికల్స్ అన్నింటికీ కచ్చితంగా లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా రిపోర్టును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ఏఐ కంటెంట్ సాధారణ పౌరులతోపాటు వీఐపీలను కూడా అయోమయానికి గురి చేస్తోందని పేర్కొంది.
News September 15, 2025
రాయలసీమ కోనసీమ అవుతోంది: సీఎం

AP: రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో మంచి ఫలితాలు సాధించామని, ఇప్పుడది కోనసీమగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామని తెలిపారు. హంద్రీనీవా కాలువతో కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లామన్నారు. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలని కలెక్టర్లకు సూచించారు.
News September 15, 2025
పాక్‌పై గెలిచాక భార్యతో SKY సెలబ్రేషన్స్

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి హోటల్‌కు తిరిగి వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌కి తన భార్య దేవిషా శెట్టి నుంచి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన బర్త్‌డే కావడంతో స్పెషల్ కేక్ కట్ చేయించారు. అంతేకాదు ఆయన నుదురుపై కేకు తిలకం దిద్దారు. దీనికి సంబంధించిన ఫొటోలను దేవిషా తన ఇన్‌స్టా అకౌంట్‌లో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే మై స్పెషల్ వన్’ అని రాసుకొచ్చారు.