News August 11, 2024

నెమలి కూర వండడంపై వీడియో.. చివరికి..

image

జాతీయ పక్షి నెమలిని వేటాడటం, చంపడం నేరం. కానీ తెలంగాణకు చెందిన ఓ యూట్యూబర్ దాన్ని చంపి ఏకంగా కూర ఎలా వండాలో వీడియో చేశాడు. సిరిసిల్ల(D) తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్‌ అడవిలోకి వెళ్లి నెమలిని చంపాడు. దాన్ని కూర వండే విధానాన్ని తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశాడు. విషయం పోలీసులకు తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అడవిలో ప్రణయ్ కూర వండిన ప్రదేశాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు.

Similar News

News January 19, 2026

గంభీర్ సారథ్యంలో పరాభవాల పర్వం!

image

గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక టీమ్ ఇండియా ODI, టెస్టుల్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది.
*27ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో 3 మ్యాచుల ODI సిరీస్‌లో 0-2తో ఓటమి
*20ఏళ్ల తర్వాత హోమ్ టెస్ట్ సిరీస్‌లో SA చేతిలో ఓటమి(0-2)
*AUS చేతిలో వన్డే సిరీస్‌లో ఓటమి(1-2)
*తొలిసారి హోమ్ టెస్ట్ సిరీస్‌లో NZ చేతిలో వైట్ వాష్‌(0-3)
*తొలిసారి హోమ్ ODI సిరీస్‌లో NZ చేతిలో ఓటమి(1-2)

News January 19, 2026

ఈ సమ్మర్‌లో మిక్స్‌డ్ వెదర్

image

ఈసారి ఎండాకాలంలో మిక్స్‌డ్ వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉందని, ఓ వైపు ఎండలతో పాటు వానలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 2023కు మించిన ఎండలు, మేతో పాటు జూన్ ప్రారంభంలో తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు చలి ప్రభావం తగ్గుముఖం పడుతుందని తెలిపారు.

News January 19, 2026

చార్‌ధామ్ యాత్ర.. టెంపుల్స్‌లోకి మొబైల్స్ బంద్

image

చార్‌ధామ్ యాత్రలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు, సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లోకి మొబైల్స్, కెమెరాలు తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. వీటి వినియోగంతో దర్శన సమయంపై ప్రభావం పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మొబైల్స్, కెమెరాలు సేఫ్‌గా ఉంచడానికి టెంపుల్స్ వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.