News August 11, 2024

ప.గో.: దేవాదాయ శాఖ జిల్లా నూతన కార్యవర్గం ఇదే

image

దేవాదాయ శాఖ ఉమ్మడి ప.గో. జిల్లా సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం తణుకులో ఎన్నుకున్నారు. స్థానిక సీతారామాంజనేయస్వామి దేవస్థానంలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా నల్లం రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా జగదీశ్వరరావు, కార్యదర్శిగా శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిగా నాగేశ్వరరావు, కోశాధికారిగా కుసుమకుమార్, కార్యవర్గ సభ్యులుగా ఎంవీవీఎస్‌ నందకుమార్, జీవీ రమణ, ఎస్‌కే నబీ, సాంబశివరావు ఎన్నికయ్యారు.

Similar News

News December 31, 2025

సంక్రాంతి సందడి.. పశ్చిమలో హోటళ్లు హౌస్‌ఫుల్!

image

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగకు ప.గో జిల్లాకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వస్తుంటారు. పండుగ నాలుగు రోజులు జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఉండటానికి హోటళ్లు, లాడ్జిలు ముందుగానే బుక్‌ చేసుకున్నారు. దాదాపు ఆరు నెలల ముందుగానే బుక్‌ చేసుకోవడంతో పండుగ సమయంలో హోటల్‌ రూమ్‌లు దొరకడంలేదు. నాలుగు రోజుల్లో రూ.కోటికి పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

News December 31, 2025

జిల్లా వ్యాప్తంగా బుధవారం పెన్షన్ పంపిణీ: కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రభుత్వ ఆదేశాలతో ఒక్కరోజు ముందుగానే బుధవారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ చదవాల నాగరాణి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,24,521 మంది లబ్ధిదారులకు రూ.97.19 కోట్లను సచివాలయ సిబ్బంది నేరుగా అందజేస్తారని పేర్కొన్నారు. జనవరి 1న సెలవు కావడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉదయం నుంచే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె వివరించారు.