News August 11, 2024

అదానీ స్టాక్స్‌లో రూపాయి కూడా పెట్టలేదు: 360 వన్

image

2013లో మొదలైన IPE- ప్లస్ ఫండ్ వన్ అదానీ స్టాక్స్‌లో అసలు పెట్టుబడే పెట్టలేదని 360 వన్ (గతంలో IIFL వెల్త్) వెల్లడించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై స్పందించింది. 2019లో క్లోజ్ చేసే సమయానికి ఫండ్ AUM $48 మిలియన్లకు చేరిందని, ఇందులో 90% బాండ్లలోనే మదుపు చేశామంది. ఈ వ్యవహారాలను ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ చూశారని, ఇతరుల జోక్యానికి తావులేదని స్పష్టం చేసింది. మాధబీ, ధవళ్‌కు ఫండ్‌లో1.5% వాటా ఉండేదని పేర్కొంది.

Similar News

News January 15, 2025

BIG BREAKING: KTRకు షాక్.. క్వాష్ పిటిషన్ డిస్మిస్

image

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరగాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కోనున్నారు. ఇప్పటికే ఏసీబీ ఒకసారి ఆయన్ని విచారించింది.

News January 15, 2025

‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. నిర్మాత ఆవేదన

image

‘గేమ్ ఛేంజర్’ రిలీజైన నాలుగైదు రోజుల్లోనే బస్సుల్లో, కేబుల్ ఛానల్స్‌లో ప్రసారమవడం ఆందోళన కలిగిస్తోందని నిర్మాత SKN ట్వీట్ చేశారు. ‘సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలే కాదు. ఇది 3-4 ఏళ్ల కృషి, అంకితభావం, వేలాది మంది కలల ఫలితం. ఇవి చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ముప్పు. ప్రభుత్వాలు దీనికి ముగింపు పలికేలా కఠిన చర్యలు తీసుకోవాలి. సినిమాను బతికించుకునేందుకు ఏకమవుదాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

News January 15, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ డే కలెక్షన్స్

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.45కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. వెంకటేశ్‌కు ఇవే ఆల్ టైమ్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని తెలిపింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా, భీమ్స్ సంగీతం అందించారు. నిన్న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.