News August 11, 2024
ఉమ్మడి NZB జిల్లాల్లోని నేటి ముఖ్యాంశాలు
*నిజామాబాద్‌లో అంబరాన్నంటిన బంజారా తీజ్ ఉత్సవాలు
*NZBలో వ్యక్తి అదృశ్యం.. బాసరలో మృతదేహం లభ్యం
*రైల్లో భారీగా నల్ల బెల్లం పట్టివేత
*షబ్బీర్ అలీని కలిసిన నిఖత్ జరీన్
*ఆర్మూర్: పిచ్చికుక్కల దాడి.. ఏడుగురికి గాయాలు
*భార్య కళ్ళ ముందే భర్త ఆత్మహత్య
*రుద్రూర్: నూతన గ్రామ పంచాయతీగా కొండాపూర్
*నిజాంసాగర్:చెరువులో పడి యువకుడు మృతి
Similar News
News January 21, 2025
గణతంత్ర దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలి: NZB కలెక్టర్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
News January 21, 2025
NZB: గుర్తు తెలియని యువకుడి దారుణ హత్య
నిజామాబాద్ నగర శివారులోని గూపన్ పల్లి స్మశాన వాటిక సమీపంలోని పులాంగ్ వాగు వద్ద దారుణంగా హత్యకు గురైన గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సౌత్ రూరల్ సీఐ, ఎస్సై ఆరీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడిని ఎక్కడైన హత్య చేసి పులాంగ్ వాగులో పారేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
News January 21, 2025
NZB: క్యారమ్స్‌తో కంటిచూపు మెరుగు: జిల్లా జడ్జి
క్యారమ్స్‌పై ఆడేటప్పుడు దృష్టికోణం క్యారమ్స్‌పై ఉండటం వల్ల కంటి చూపు మెరుగు పడుతుందని నిజామాబాద్ జిల్లా జడ్జీ సునీత కుంచాల అన్నారు. సోమవారం ఆమె జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశం హాల్లో క్యారమ్స్ పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు క్యారమ్స్ ఆడి మాట్లాడుతూ.. మనుషుల నిత్య జీవితంలో ఆట పాటలు ఉంటేనే సంతోషాలు వెల్లివిరుస్థాయన్నారు. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.