News August 12, 2024
HYD: రూ.3,849 కోట్లతో.. 39 మురుగు శుద్ధి ప్లాంట్లు

HYDలో ఇక మురుగు శుద్ధి 100% జరగనుందని అధికారులు చెబుతున్నారు. రూ.3,849 కోట్లతో 39 సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP)లను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమృత 2.0 ట్రాంచి -3 ప్రోగ్రాంలో భాగంగా నిర్మించనున్నారు. మొత్తం వీటిని 2 ప్యాకేజీలలో పూర్తి చేయనున్నారు. మొదటి ప్యాకేజీలో 16, రెండో ప్యాకేజీలు 22 పూర్తి కానుండగా.. వీటితో 972 MLD మురుగునీరు శుద్ధి కానుంది.
Similar News
News January 12, 2026
FLASH: బోరబండలో యువతి మర్డర్

బోరబండలో ఓ ఉన్మాది యువతిని పొట్టనబెట్టుకున్నాడు. తనతో సరిగ్గా మాట్లాడటం లేదని అక్కసుతో యువతిని అతడు దారుణంగా హత్య చేశాడు. గతంలో ఇద్దరికీ బంజారాహిల్స్‌లోని ఒక పబ్‌లో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువతి ఇటీవల ఊర్వశీ బార్‌కు షిఫ్ట్ కావడంతో మాట్లాడటం తగ్గిందని భావించిన నిందితుడు నిన్న మాట్లాడదామని పిలిచి హత్య చేసినట్లు సమాచారం. నిందితుడు ప్రస్తుతం బోరబండ పోలీసుల అదుపులో ఉన్నాడు.
News January 11, 2026
HYD: చైనా మాంజాతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చెయ్యి కట్!

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగిలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు బైక్‌పై చైతన్య (27) వెళ్తున్నాడు. బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పైకి రాగానే చైతన్య చేయికి గాలి పటం మాంజా తగిలింది. దీంతో మాంజా చెయ్యికి చుట్టుకోవడంతో చైతన్య చెయ్యి తెగింది. తీవ్ర గాయాలు అయిన చైతన్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
News January 11, 2026
HYD: కార్పొరేషన్ కోసం లష్కర్‌లో లడాయి

GHMCని 3గా విభజించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్ లేదా లష్కర్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడుతోంది. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ను విస్మరించడం తగదని స్థానికులు, BRS నేతలు మండిపడుతున్నారు. HYD- సికింద్రాబాద్ జంట నగరాలుగా పేరొందగా, సికింద్రాబాద్ పేరు లేకుండా పునర్వ్యవస్థీకరణ సరికాదంటున్నారు. సర్కార్ దిగొచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనేలా ఉద్యమం ఉద్ధృతం అయింది.


