News August 12, 2024

కడప: 109 రకాల నూతన వంగడాలు విడుదల

image

వాతావరణ మార్పులను తట్టుకొని పోషకాలు జోడించిన అత్యధిక దిగుబడులు ఇచ్చే 109 రకాల నూతన వంగడాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం విడుదల చేశారని కేవీకే సమన్వయకర్త వీరయ్య తెలిపారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నూతన వంగడాల విడుదలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన వంగడాలను రైతులు సాగు చేసి మంచి దిగుబడులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Similar News

News January 18, 2025

YSR జిల్లాపై చంద్రబాబు అసంతృప్తి

image

చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిలో చివరి మూడు స్థానాల్లో YSR జిల్లా, అల్లూరి, తూ.గో జిల్లా ఉండగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎంపీల పనీతీరు, జిల్లాలో పథకాల అమలు, తదితర వాటిలో ర్యాంకులు ఇచ్చారు. సరిగా పనిచేయని పలువురు మంత్రులను CM చంద్రబాబు హెచ్చరించారు.

News January 18, 2025

నేడు కడప జిల్లాకు చంద్రబాబు.. ట్రాఫిక్ ఆంక్షలు.!

image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. CM పర్యటన నేపథ్యంలో జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మైదుకూరుకు వెళ్లే వాహనాల దారి పూర్తిగా మళ్లించారు. బద్వేలు- పోరుమామిళ్ల వైపు వెళ్లే వాహనాలు ఖాజీపేట, నాగసానిపల్లె మీదుగా వెళ్లాలన్నారు. కడప, ప్రొద్దుటూరు, కర్నులు వైపు వెళ్లే వాహనాలు టౌన్‌లోకి రాకుండా జాతీయ రహదారి పైనుంచి వెళ్లాలని CI సయ్యద్ తెలిపారు.

News January 17, 2025

మైదుకూరుకు సీఎం.. షెడ్యూల్ ఖరారు!

image

మైదుకూరులో రేపు CM చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రేపు మధ్యాహ్నం 12 గం. నుంచి హెలికాఫ్టర్ ద్వారా మైదుకూరు చేరుకుని, అనంతరం 12:20 నుంచి 1 గం. వరకు NTR వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 1:55 నుంచి మైదుకూరు మున్సిపల్ ఆఫీస్‌ నుంచి ఇళ్లను సందర్శిస్తారు. 2:15 నుంచి చెత్త సేకరణపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.