News August 12, 2024
శ్రావణ సోమవారం శివయ్యను ఇలా పూజించాలి

శ్రావణమాసంలో శివపార్వతులను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ నెలలో వారు భూమిపై నివసించి భక్తులపై ఆశీర్వాదాలు కురిపిస్తారని నమ్ముతారు. ముఖ్యంగా శ్రావణ సోమవారం శివయ్య పూజకు అత్యంత విశిష్టమైన రోజు. ఇవాళ నీలకంఠుడిని పూజించడం ద్వారా శత్రు భయాలు, పనుల్లో ఆటంకాలు, తంత్ర మంత్రాల ప్రభావం తొలగిపోతుందని చెబుతారు. చెరుకు రసంతో అభిషేకం చేసి ‘ఓం నమో నీలకంఠాయనమ:’ అనే మంత్రాన్ని జపించాలి.
Similar News
News January 16, 2026
ట్యాపింగ్ కేసు.. ఇంకెంతకాలం విచారిస్తారు: సుప్రీం

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 10కి వాయిదా వేసింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ కొనసాగుతుందని, ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ప్రభాకర్ రావు విచారణకు గడువు ఇప్పటికే పూర్తయిందని, ఇక అదనపు విచారణ అవసరం లేదని పేర్కొంది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని సిట్‌ను ప్రశ్నించింది.
News January 16, 2026
ఆధిక్యంలో మెజార్టీ మార్క్ దాటిన BJP కూటమి

BMC ఎన్నికల కౌంటింగ్‌లో BJP+ దూసుకుపోతోంది. ఏక్‌నాథ్ షిండే శివసేనతో కూడిన కూటమి మెజారిటీ మార్కును (114) దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 115 వార్డుల్లో ముందంజలో ఉంది. మరోవైపు ఠాక్రే సోదరుల కూటమి 77 వార్డుల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. ఇక తమ కంచుకోట పుణే, పింప్రి చించ్వివాడ్‌లో ‘పవార్’ల పట్టు సడలినట్లు కనిపిస్తోంది. ఇక్కడ కూడా BJP హవానే కొనసాగుతోంది.
News January 16, 2026
ఎర్ర బెండ రకాల్లో ‘కాశీ లాలిమ’ ప్రత్యేకం

‘కాశీ లాలిమ’ ఎర్ర బెండను IIVR వారణాసి రూపొందించింది. ఈ కాయలు ఆకర్షణీయంగా ఉంటాయి. దీనికి కాయపుచ్చు పురుగు ముప్పు తక్కువ. దీని వల్ల పురుగు మందుల పిచికారీ అవసరం లేదు. చెట్టు పొట్టిగా ఉంటుంది. అందకే దగ్గర దగ్గరగా మొక్కలు నాటుకోవాలి. కాయపై దురద కలిగించే నూగు ఉండదు. అందుకే ఈ బెండ కాయలను సులభంగా కోయవచ్చు. పల్లాకు వైరస్ తెగులును ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ కాయల్లో జిగురు తక్కువగా ఉంటుంది.


