News August 12, 2024
నేడు రైతులకు ధాన్యం బకాయిలు విడుదల

AP: గత రబీలో ధాన్యం విక్రయించిన 35,374 మంది రైతులకు రూ.674.47 కోట్ల బకాయిలను ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేయనున్నారు. ఏలూరులో జరిగే కార్యక్రమంలో ఇందుకు సబంధించిన చెక్కులను రైతులకు మంత్రి అందజేయనున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో 82,825 మందికి రూ.1657.44 కోట్ల బకాయిలు ఉండగా ఎన్డీఏ సర్కార్ గత నెలలో 49,350 మంది రైతులకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది.
Similar News
News October 15, 2025
కోడి పిల్లలను షెడ్డులోకి వదిలే ముందు జాగ్రత్తలు

కోడి పిల్లలను షెడ్డులోకి వదలడానికి 10 రోజుల ముందే షెడ్డును శుభ్రపరచి, గోడలకు సున్నం వేయించాలి. బ్రూడరు, మేత తొట్లు, నీటి తొట్లను క్లీన్ చేయాలి. వరి పొట్టును 2-3 అంగుళాల మందంలో(లిట్టర్) నేలపై వేసి.. దానిపై పేపరును పరచాలి. కోడి పిల్లల మేత, నీటి తొట్లను బ్రూడరు కింద ఒకదాని తర్వాత ఒకటి అమర్చాలి. బ్రూడరు చుట్టూ 2-3 అడుగుల దూరంలో 18 అంగుళాల ఎత్తుగా అట్టను వృత్తాకారంలో రక్షక దడిగా అమర్చాలి.
News October 15, 2025
గుడికి వెళ్తే తప్పకుండా తల స్నానం చేయాలా?

దైవ దర్శనానికి వెళ్లేముందు తలస్నానం తప్పక చేయాలని పండితులు సూచిస్తున్నారు. మన మనస్సు నిత్యం కామ, క్రోధ, లోభం వంటి అరిషడ్వర్గాలతో నిండి, అపవిత్రంగా ఉంటుంది. ఆ మనసును శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక శక్తి మనకు తక్షణమే లభించదు. కాబట్టి కనీసం శరీరాన్ని పూర్తిగా శుభ్రపరచుకుని, శుచిగా దైవ దర్శనం చేసుకోవాలి. శరీరంలాగే మన మనస్సు కూడా శుద్ధంగా, నిర్మలంగా ఉండాలని భగవంతుడిని వేడుకోవాలి. <<-se>>#DHARMASANDEHALU<<>>
News October 15, 2025
మీరు ఫోన్ ఎలా పట్టుకుంటున్నారు?

చాలామంది ఫోన్లను కిందకి పట్టుకుని తల వంచి చూస్తుంటారు. ఇప్పుడూ అలా చూస్తూనే చదువుతున్నారా? అయితే మీరు డిప్రెషన్‌కు దగ్గరగా ఉన్నట్లే. ఎక్కువసేపు తలవాల్చడం, లేజీగా కూర్చోవడం వల్ల వెన్నెముకతో పాటు బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడి డిప్రెషన్ ఫీలింగ్స్ పెరుగుతాయని డాక్టర్స్ చెబుతున్నారు. కళ్లు, ఫోన్ ఒకే లెవెల్‌లో ఉండాలని, 20 మినట్స్‌కు ఒకసారి బ్రేక్ తీసుకుని బాడీ స్ట్రెచ్ చేయాలని సూచిస్తున్నారు. SHARE IT