News August 12, 2024
నేడు స్టాక్ మార్కెట్ల క్రాష్ తప్పదా?

సెబీ చీఫ్ మాధబిపై హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్ల గమనంపై ఆసక్తి నెలకొంది. నేడు బెంచ్‌మార్క్ సూచీల ఆరంభం గురించి ఇన్వెస్టర్లు కలవరపడుతున్నారు. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్ ఉంటుందా? క్రాష్ అవుతాయా? లేక కన్సాలిడేట్ అవుతాయా? అదానీ స్టాక్స్‌లో రియాక్షన్ ఏంటి? చూడాల్సి ఉంది. తాజా రిపోర్టులో హైప్ తప్ప ఆధారాలు లేకపోవడంతో షార్ట్ సెల్లింగ్ తక్కువే ఉంటుందని కొందరు <<13829729>>విశ్లేషకులు<<>> అభిప్రాయపడ్డారు.
Similar News
News November 6, 2025
వరల్డ్ క్లాస్ బ్యాంకుల కోసం చర్చలు: నిర్మల

భారత్‌కు అతిపెద్ద, వరల్డ్ క్లాస్ బ్యాంకుల అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. ఆర్బీఐతోపాటు బ్యాంకులతోనూ చర్చిస్తున్నామని ముంబైలో జరిగిన 12th SBI బ్యాంకింగ్&ఎకనామిక్స్ కాంక్లేవ్‌లో తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టిసారించామని, పదేళ్లలో మూలధన వ్యయం 5 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు.
News November 6, 2025
మామిడికి బోరాన్ ఎలా అందిస్తే మంచిది?

బోరాన్‌ను మామిడి మొక్క/చెట్లపై పిచికారీ చేసినప్పుడు లేత, మృదువైన మొక్క బాగాలు, ఆకులు, రెమ్మలు, పూత బాగా పీల్చుకుంటాయి. అంటే చెట్లలో కొత్త చిగుర్లు వచ్చినప్పుడు పూ మొగ్గలు, పూత, లేత పిందెల సమయంలో చెట్లపై బోరాన్ పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చెట్లలో ముదురు ఆకులు ఉన్నప్పుడు, చెట్లు నిద్రావస్థలో ఉన్నప్పుడు (అక్టోబర్-నవంబర్) బోరాన్‌ను భూమికి వేసుకోవడం మంచిదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News November 6, 2025
నైట్ స్కిన్ కేర్ ఇలా..

పగలంతా అలసిపోయిన చర్మం రాత్రివేళ తనని తాను రిపేర్ చేసుకుంటుంది. ఏదైనా స్కిన్ ట్రీట్మెంట్ చెయ్యాలన్నా ఇదే సరైన సమయం. ఇందుకోసం యాంటీఆక్సిడెంట్స్ ఉన్న నైట్ క్రీమ్ అప్లై చేయాలి. ఇవి వయసుని పెంచే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. కళ్ల కింద ఉబ్బు వస్తుంటే కెఫీన్ ఉన్న ఐక్రీమ్స్ అప్లై చెయ్యాలి. వాజిలీన్/ కొబ్బరి నూనెను చేతులకు, పాదాలకు అప్లై చేసి గ్లౌవ్స్, సాక్స్ వేసుకుని పడుకుంటే ఉదయానికి మృదువుగా మారతాయి.


