News August 12, 2024
కూతుళ్లను కాపాడబోయి..

TG: మేడ్చల్ <<13829788>>ఘటనలో<<>> హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గౌడవెల్లి స్టేషన్ వద్ద ట్రాక్‌మెన్ కృష్ణ పనులు చేస్తుండగా భార్య కవిత ఇద్దరు పిల్లలు వర్షిత(10), వరణి(7)తో కలిసి భోజనం తీసుకొచ్చింది. కొద్దిసేపు ఆగితే అందరం కలిసి ఇంటికి వెళ్దామని కృష్ణ చెప్పాడు. దీంతో పిల్లలు ఆడుకుంటూ ట్రాక్‌పైకి వెళ్లారు. గమనించిన కృష్ణ వారిని కాపాడేందుకు పరిగెత్తగా అంతలోనే దూసుకొచ్చిన రైలు ముగ్గురినీ కబళించింది.
Similar News
News November 7, 2025
TODAY TOP STORIES

* చొరబాటుదారులను కాపాడే పనుల్లో RJD, కాంగ్రెస్ బిజీ: మోదీ
* బిహార్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. 64.66% ఓటింగ్ నమోదు
* డిజిలాకర్‌లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు: CM CBN
* చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్
* BRS ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: CM రేవంత్
* రేవంత్‌కు రోషముంటే KTRను జైల్లో పెట్టాలి: బండి సంజయ్
* T20లో ఆసీస్‌పై భారత్ విక్టరీ.. సిరీస్‌లో 2-1 లీడ్
News November 7, 2025
మరో 4 ‘వందేభారత్’లు.. ఎల్లుండి ప్రారంభం

దేశంలో మరో 4 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో-సహరన్‌పూర్, ఎర్నాకుళం-బెంగళూరు, బనారస్-ఖజురహో, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఆగస్టు నాటికి దేశంలో 150 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.
News November 7, 2025
మంత్రులు, అధికారులకు సీఎం వార్నింగ్

AP: ఫైల్స్ క్లియరెన్స్‌లో అలసత్వం జరుగుతోందని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రులు, అధికారులు తమ పనిలో కమిట్‌మెంట్ చూపించాలని ఆదేశించారు. కొంతమంది పనితీరు సంతృప్తికరంగా లేదని, ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు సమయానికి సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అందరం బాధ్యతగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.


