News August 12, 2024
నేడు అమరావతికి చంద్రబాబు.. విశాఖ MLC అభ్యర్థి ఫైనల్.!

ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల కూటమి MLCఅభ్యర్థిపై తర్జనభర్జన కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఇవాళ అమరావతికి రానున్నారు. ఈ క్రమంలో ఆయన అభ్యర్థిని ఫైనల్ చేస్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. పీలా గోవింద సత్యనారాయణ, గండి బాబ్జి, బైరా దిలీప్ చక్రవర్తి, సీతంరాజు సుధాకర్ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, YCP అభ్యర్థి బొత్స సత్యనారాయణ నేడు నామినేషన్ వేయనున్నారు.
Similar News
News September 18, 2025
ఆనందపురం: కుక్క అడ్డురావడంతో ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగన్నాధపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎర్ర గౌరి నాయుడు(40) గురువారం మధ్యాహ్నం కుసులవాడ తీగలవానిపాలెం చెరువు దగ్గర కుక్క అడ్డం రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. తలకు తీవ్ర గాయాలవల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 18, 2025
విశాఖలో ఏడు చోట్ల చైన్ స్నాచింగ్

విశాఖలో బుధవారం రాత్రి చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. వన్ టౌన్, కంచరపాలెం, షీలా నగర్ ప్రాంతాల్లో ఒకే బ్యాచ్ ఏడు చైన్ స్నాచింగ్‌లు చేసి కలకలం సృష్టించింది. ఒకే బైక్ పై ఇద్దరు యువకులు ఈ ఏడు చోట్ల చోరీలు చేసినట్లు సమాచారం. దొంగతనం చేసిన బైక్‌తో స్నాచింగ్‌కు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. 7 చోట్ల జరిగిన స్నాచింగ్‌లో సుమారు 20 తులాల వరకు బంగారు ఉంటుందని చెబుతున్నారు.
News September 18, 2025
సొంత నియోజకవర్గంలోనే పల్లాకు తలనొప్పి

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై TDP రాష్ట్ర అధ్యక్షుడు P.శ్రీనివాస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీ అధినేతగా రాష్ట్రవ్యాప్తంగా సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నా.. సొంత నియోజకవర్గంలో మాత్రం ప్లాంట్ ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది. ప్లాంట్ ప్రైవేటీకరణకు TDP కూడా కారణమని కార్మిక సంఘాల ఆరోపణలు, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఏమైయ్యాయి? అని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తుండడంతో పల్లాకు మరింత ఇబ్బందిగా మారింది.