News August 12, 2024

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

image

మోటకొండూరు మండలం ఇక్కుర్తి వీధి దీపాలు బిగిస్తుండగా విద్యుత్ షాక్‌తో యువకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై పాండు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గిరిధర్ ఈనెల 9న గ్రామంలో వీధి దీపాలు బిగిస్తుండగా విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గిరిధర్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News November 10, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

→ మిర్యాలగూడ: అమానుషం.. కుక్క నోట్లో మృతశిశువు
→ నల్గొండ: ప్రజావాణికి 94 దరఖాస్తులు
→ నార్కట్‌పల్లి: లారీ బోల్తా.. ఉల్లిగడ్డ బస్తాలు ఎత్తుకెళ్ళారు.
→ నల్గొండ: ఇన్‌చార్జి పాలన ఇంకెనాళ్లు?
→ కట్టంగూర్: ఈ సంతకు 75 ఏళ్ల హిస్టరీ
→ నల్గొండ: తగ్గిన ఉష్ణోగ్రతలు.. చలి షురూ
→ నల్గొండ: MGUకి అరుదైన గౌరవం
→ నాగార్జునసాగర్: ఆయకట్టులో జోరుగా వరికోతలు

News November 10, 2025

నల్గొండ: ధాన్యం కొనుగోలుపై మంత్రుల సమీక్ష

image

ఖరీఫ్ ధాన్యం సేకరణ పురోగతిపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. నల్గొండ జిల్లాలో రైతులకు ఇప్పటివరకు రూ.160 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు. తడిసిన 4,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొన్నారని వివరించారు. పత్తి కొనుగోళ్ల కోసం అదనంగా తేమ కొలిచే యంత్రాల కొనుగోలుకు మంత్రి తుమ్మల ఆదేశించారు.

News November 10, 2025

NLG: ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి పెట్టండి: కలెక్టర్‌

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కారం కావాలని, ఏ ఒక్క దరఖాస్తును కూడా పెండింగ్‌లో ఉంచవద్దని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.