News August 12, 2024
మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా కృషి చేద్దాం: కలెక్టర్

శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో సోమవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతకు అవగాహన తప్పనిసరి అని, యువతపై వాటి ప్రభావం పడకుండా వాటి నియంత్రణే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
Similar News
News January 3, 2026
మందస: గోడ కూలి కార్మికురాలు మృతి

మందస మండలం బేతాళపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఇల్లు నిర్మాణ పనులు చేపడుతుండగా..బత్తిని కాంతమ్మ (39) అనే భవన నిర్మాణ కార్మికురాలిపై ఒక్కసారిగా గోడ కూలిపోయింది. తీవ్ర గాయాల పాలైన కాంతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 3, 2026
శ్రీకాకుళం: B.Ed పరీక్షల నోటిఫికేషన్ విడుదల

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 14 B.Ed కళాశాల్లో మొదటి సెమిస్టర్ పరీక్షలకు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 17లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఈనెల 27 నుంచి పరీక్షలు నిర్వహించనున్నామని వెల్లడించారు. 1,000 మంది వరకు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. త్వరలో పరీక్ష షెడ్యూల్ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
News January 3, 2026
శ్రీకాకుళం జిల్లాలో 57 ఉద్యోగాలకు నోటిఫికేషన్

శ్రీకాకుళం జిల్లాలో 57 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో(KGVB) 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.


