News August 12, 2024
నీరుగారుతున్న స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యం?

గ్రేటర్లో భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు ప్రక్రియ గాడితప్పింది. ఎక్కడ పడితే అక్కడే అవి దర్శనమిస్తున్నాయి. నిర్మాణ వ్యర్థాల సేకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. కానీ వాటి నుంచి స్పందన అంతంత మాత్రమే ఉండడంతో వ్యర్థాలు రోడ్ల పక్కనే పేరుకుపోతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి కారణంగా భవన నిర్మాణ వ్యర్థ్యాలు అనుమతి లేని ప్రదేశాల్లో పడేస్తున్నారు. దీంతో స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యం నీరుగారుతుంది.
Similar News
News November 5, 2025
HYD: డ్రంక్ & డ్రైవ్లో దొరికి PS ముందే సూసైడ్

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ సూసైడ్ కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒక వ్యక్తి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 3, 2025
రంగారెడ్డి: ప్రజావాణికి 25 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, DRO సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఈ రోజు ఉదయం RR జిల్లా చేవెళ్ల మండలం, మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ప్రజావాణికి 25 ఫిర్యాదులు రాగా ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు.
News November 2, 2025
రంగారెడ్డి: ‘స్కాలర్షిప్నకు దరఖాస్తులు చేసుకోండి’

ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం ద్వారా ఎస్సీ విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందిస్తారని రంగారెడ్డి జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రామారావు తెలిపారు. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు ఉండాలని సూచించారు.


