News August 12, 2024

ప్రకాశం ఎస్పీ పరిష్కార వేదికకు 94 ఫిర్యాదులు

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ పరిష్కార వేదికకు 94 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులతో ఎస్పీ దామోదర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే ఫిర్యాదులు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.

Similar News

News January 24, 2026

ప్రకాశం: స్కూల్ బస్సు ఢీ.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఉల్లగల్లుకి చెందిన తప్పెట చిన్ని ఒంగోలులో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. భార్య రాజ్యంతో కలిసి స్కూటీపై ఉల్లగల్లులోని బ్యాంకు పని చూసుకోని వెళ్తున్నారు. శంకరాపురం- తిమ్మాయపాలెం మధ్యలో స్కూల్ బస్ స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో చిన్ని అక్కడికక్కడే చనిపోయాడు. రాజ్యానికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

News January 24, 2026

మార్కాపురం: రెండు బస్సులు ఢీ.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు

image

మార్కాపురం జిల్లా పెద్దారికట్ల జంక్షన్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొద్దుటూరు నుంచి విజయవాడ వెళ్తున్న వాసవి ట్రావెల్స్ బస్సు, విజయవాడ నుంచి కనిగిరి వస్తున్న ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, సుమారు 10 మంది గాయపడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News January 23, 2026

కందుకూరు LICలో రూ.3 కోట్ల స్కాం.!

image

కందుకూరు LICలో భారీ స్కాం బయటపడింది. పూర్వాశ్రమంలో ఏజెంట్‌గా ఉండి తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్‌గా మారిన పూజల శ్రీనివాస్ పథకం ప్రకారం స్కాంకు పాల్పడ్డాడు. దొంగ పాలసీలు చేయించి నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.3 కోట్లు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొత్త సాప్ట్‌వేర్‌తో ఈ స్కాం గుట్టు రట్టయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.