News August 12, 2024

ఈనెల 14న అప్పన్న ఆరాధన, సుప్రభాత టికెట్లు నిలుపుదల

image

సింహాచలం సింహాద్రి అప్పన్న సుప్రభాత ఆరాధన టికెట్లు ఈనెల 14న నిలుపుదల చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసమూర్తి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 13వ తేదీన కొండపై వెలసిన శ్రీఉమా మహేశ్వరి పాదాలమ్మ, బంగారమ్మ పండుగ జరగనున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు తొలేళ్ళ ఉత్సవం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.

Similar News

News September 30, 2024

విశాఖ కానిస్టేబుల్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్

image

ఎండాడ మహిళా పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్ కనకల వెంకట నరసింహమూర్తి ఈనెల 22న విధులకు వెళ్లారు. డ్యూటీ అనంతరం నరసింహమూర్తి ఇంటికి రాలేదు. అతని భార్య ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో స్టేషన్లో ఆరా తీసి మిస్సింగ్ కేసు పెట్టింది. అయితే ఆదివారం నరసింహమూర్తి ఇంటికి చేరుకున్నాడు. ఆ సంగతి తెలుసుకున్న SI వెళ్లి ఆరా తీయగా పనిఒత్తిడితో ప్రశాంతత కోసం తిరుపతి, విజయవాడ దైవ దర్శనానికి వెళ్లినట్లు అతను తెలిపాడు.

News September 30, 2024

విశాఖ: ‘ఓటుహక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి’

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నోటిఫికేషన్ వెలువడిందన్నారు. ఓటు నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైందని నవంబర్ 6 వరకు కొనసాగుతుందన్నారు. నవంబర్ 23న డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుందన్నారు. 23 నుంచి డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, 30న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. >Share it

News September 30, 2024

విశాఖ కేజీహెచ్ నుంచి విద్యార్థి పరారీ..!

image

డౌనూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థి కే.సురేష్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు కొయ్యూరు ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ చొరవ తీసుకుని కేజీహెచ్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థి సోమవారం ఆసుపత్రి నుంచి పరారయ్యాడని ఏటీడబ్ల్యూవో తెలిపారు. నాటువైద్యం చేయించడానికి తల్లిదండ్రులు స్వగ్రామమైన కుడిసింగి తీసుకెళ్లి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.