News August 12, 2024
విశాఖ: శిశు విక్రయాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం

అనధికార శిశు విక్రయాలపై లోతైన విచారణ జరిపి నివేదిక అందించాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు నేతృత్వంలో విశాఖ నగర పోలీసు కమిషనర్‌కు సోమవారం ఆదేశించినట్లు కమిషన్ సభ్యులు సీతారాం తెలిపారు. సోమవారం కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో ప్రత్యేకంగా దృష్టి సారించి మూలాలను శోధించాలని సూచించింది. అనధికార దత్తత స్వీకారాలపై అవగాహన కల్పించాలని కమిషనర్ కోరింది.
Similar News
News January 18, 2026
విశాఖ: మాస్టర్ ప్లాన్ మార్చిలోనే..!

భోగాపురం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని VMRDA మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. అయితే YCP ప్రభుత్వం ప్రకటించిన కొన్ని ప్రతిపాదనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ప్రైవేట్ భూములకు సంబంధించిన అంశాల్లో ఎక్కువ మందికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూటమికి ఫిర్యాదులు అందాయి. ఈ అభ్యంతరాలపై సమీక్షించిన అనంతరం మార్చి నాటికి మాస్టర్ ప్లాన్‌ను ప్రకటిస్తామని VMRDA స్పష్టం చేసింది.
News January 18, 2026
సింహాచలం: సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం నేడే

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి తెప్పోత్సవం ఈరోజు సాయంత్రం వైభవంగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు స్వామిని మెట్ల మార్గం గుండా కొండ దిగువ గల వరాహ పుష్కరణి వద్దకు తీసుకొస్తారు. సుమారు 5 గంటల ప్రాంతంలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. వేణుగోపాల స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది.
News January 18, 2026
విశాఖ: నేవీ కార్యక్రమాలపై సీపీ సమీక్ష

విశాఖలో ఫిబ్రవరి 14 నుంచి 25 వరకు జరగనున్న ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐయాన్స్-కాన్ క్లెవ్ కార్యక్రమాలపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి నేవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్, నో-డ్రోన్ జోన్, పార్కింగ్‌పై కీలక చర్చలు జరిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.


