News August 12, 2024
పాము, ముంగిసల మధ్య శత్రుత్వం ఎందుకు?

పాము, ముంగిస ఎదురుపడితే హోరాహోరీ ఫైట్ తప్పదు. దీనికి కారణం ఏంటని మీరెప్పుడైనా ఆలోచించారా? ముంగిస పిల్లలను పాము తింటుంది. తన పిల్లలను రక్షించడానికి పాముపై ముంగిస దాడి చేసి చంపి తింటుంది. విషపు సంచిని మాత్రం వదిలేస్తుంది. పాము కంటే ముంగిస చురుకైంది. పాము విషాన్ని తట్టుకునే శక్తి ముంగిసకు ఉండటంతో ఫైట్‌లోనూ 80% అదే గెలుస్తుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా వీటి ఫైట్ ప్రత్యక్షంగా చూశారా?
Similar News
News December 27, 2025
మండలాలు పక్క జిల్లాల్లోకి!

AP: <<18685889>>పునర్విభజనలో<<>> గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు నియోజకవర్గంలోని 5 మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాలని CM చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురంలో, రైల్వే కోడూరును తిరుపతిలో, పొదిలిని ప్రకాశంలో, రాజంపేటను కడపలో, రాయచోటి(అన్నమయ్య)ని మదనపల్లెలో విలీనం చేయాలన్న అంశంపైనా చర్చ జరిగింది. అటు ఆదోనిని రెండు మండలాలుగా విభజించాలని అభిప్రాయపడ్డారు.
News December 27, 2025
చైనా ఆంక్షలు.. వెండి ధరకు రెక్కలు?

2026 నుంచి వెండి ఎగుమతులపై చైనా ఆంక్షలు విధిస్తోంది. ఇకపై సిల్వర్‌ను విదేశాలకు పంపాలంటే లైసెన్స్ తప్పనిసరి. సోలార్ ప్యానెల్స్, EVs, మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీలో ఈ లోహం చాలా కీలకం. గ్లోబల్ మార్కెట్లో 60-70% వెండి చైనా నుంచే వస్తోంది. దీంతో గ్రీన్ ఎనర్జీ, టెక్ రంగాల్లో ఇబ్బందులు రావొచ్చని ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వెండి ధరలు మరింత పెరగొచ్చని నిపుణుల అంచనా.
News December 27, 2025
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


