News August 12, 2024

నకిలీ సదరం సర్టిఫికెట్లపై సీఎం చంద్రబాబు ఫైర్

image

AP: నకిలీ సదరం సర్టిఫికెట్లపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్యశాఖను ఆదేశించారు. దీనిపై పూర్తి సమాచారం సేకరించి, పంచాయతీ రాజ్ శాఖ సమన్వయంతో కట్టడి చేయాలని స్పష్టం చేశారు. అటు ప్రతి నియోజకవర్గంలో పీపీపీ విధానంలో ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వమే స్థలం ఇస్తుందని చెప్పారు.

Similar News

News February 14, 2026

ధురంధర్‌లో అక్షయ్ ఖన్నా రోల్ ఆఫర్.. నాగార్జున క్లారిటీ

image

బాక్సాఫీస్ వద్ద రూ.వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ధురంధర్‌లో అక్షయ్ ఖన్నా పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కాగా ఈ పాత్రలో నటించాలని మేకర్స్ తొలుత నాగార్జునను అడిగారని, డేట్స్ అడ్జస్ట్ కాక తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై నాగ్ స్పందిస్తూ ఈ క్యారెక్టర్ గురించి తనకెలాంటి ఆఫర్ రాలేదని క్లారిటీ ఇచ్చారు. అక్షయ్ ఖన్నా నటన అద్భుతమని, అలాంటి పాత్రలో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

News February 14, 2026

BRS విప్ ఇస్తే గైర్హాజరయ్యేలా ఆ MLAల ప్లాన్!

image

TG: ఎన్నికల్లో 30కి పైగా మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే MP, MLA, MLCలు కీలకంగా మారారు. ఈ తరుణంలో తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉంటున్న MLAల విషయంలో BRS తర్జనభర్జన పడుతోంది. విప్ జారీచేయాలని, దాన్ని ఉల్లంఘిస్తే కనుక అనర్హత కేసుకు బలం చేకూరుతుందని భావిస్తోంది. కాగా BRS విప్ ఇస్తే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఆ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం.

News February 14, 2026

చెన్నైలోని NITTTRలో ఉద్యోగాలు

image

చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(NITTTR)12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. MTS పోస్టుకు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://www.nitttrc.ac.in